అందుకే జబర్దస్త్‌ నుంచి బయటకు : నాగబాబు | Naga Babu Quits Jabardasth Show | Sakshi
Sakshi News home page

అందుకే జబర్దస్త్‌ నుంచి బయటకు వచ్చేశా : నాగబాబు

Published Thu, Nov 21 2019 8:20 PM | Last Updated on Fri, Nov 22 2019 2:38 PM

Naga Babu Quits Jabardasth Show - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : గత ఏడేళ్లుగా తెలుగు బుల్లితెరపై నవ్వులు పూయిస్తున్న బిగ్గెస్ట్‌ కామెడీ షో ‘జబర్దస్త్‌’ నుంచి నటుడు నాగబాబు తప్పుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన యూట్యూబ్‌ చానెల్‌ ద్వారా ప్రకటించారు. గురువారం నాగబాబు తన యూట్యూబ్‌ చానెల్‌ ద్వారా మాట్లాడుతూ.. రేపటి (శుక్రవారం) ఎపిసోడ్‌తో జబర్దస్త్‌లో తన జర్నీ ముగుస్తుందని చెప్పారు.

‘నాకు ప్రతి గురువారం, శుక్రవారం చాలా ముఖ్యమైన రోజులు. 2013 నుంచి 2019 వరకు జబర్దస్త్‌తో నా ప్రయాణం కొనసాగింది. ఈ ప్రయాణం మరిచిపోలేనిది. నాకు నేనుగా జబర్దస్త్‌ నుంచి బయటకు వస్తానని ఎప్పుడూ అనుకోలేదు. బిజినెస్‌కు సంబంధించిన ఐడియాలాజికల్‌ విభేదాల వల్ల బయటకు వచ్చానే తప్ప దీంట్లో ఎవరి తప్పు లేదు. జబర్దస్త్‌ నిర్మాత శ్యాంప్రసాద్‌ రెడ్డికి థ్యాంక్స్‌. నేను ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు జబర్దస్త్‌లోకి వచ్చాను. నా స్థాయికి తగ్గటు కాకపోయినా మంచి రెన్యూమరేషన్‌ ఇచ్చారు. అది నాకు చాలా ఉపయోగపడింది. రెన్యూమరేషన్‌ విషయంలో విభేదాలు వచ్చి వెళ్లిపోయాడనేది అబద్ధం. నేను పారితోషికం కోసమే జబర్దస్త్‌కి రాలేదు. నాకు అది పెద్ద విషయమే కాదు. హాలిడే ట్రిప్పులా ఇన్ని రోజులు షో నడిచింది. ఈ విషయంలో మరోసారి శ్యాంప్రసాద్‌రెడ్డి ధన్యవాదాలు చెబుతున్నాను. నా జర్నీ ఎలా మొదలైంది. ఎలా క్లోజ్‌ అయిందనేది తర్వాత రోజుల్లో చెబుతాను’ అని నాగబాబు పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement