చూశారు.. మాట్లాడుకున్నారు.. లవ్‌లో పడ్డారు! | Naga Chaitanya Gautham Menon Simbu once again | Sakshi
Sakshi News home page

చూశారు.. మాట్లాడుకున్నారు.. లవ్‌లో పడ్డారు!

Published Tue, Oct 20 2015 1:43 AM | Last Updated on Fri, Jul 12 2019 3:37 PM

చూశారు.. మాట్లాడుకున్నారు.. లవ్‌లో పడ్డారు! - Sakshi

చూశారు.. మాట్లాడుకున్నారు.. లవ్‌లో పడ్డారు!

ప్రేమ ఎప్పుడు పుడుతుందో ఎవరూ చెప్పలేరు. ఆ కుర్రాడు కూడా చెప్పలేడు. ఆడుతూ పాడుతూ తిరిగే ఆ కుర్రాడి మనసును ఓ అమ్మాయి ఏదో మాయ చేసి, అతనిలో ప్రేమ పుట్టించేసింది. ఆమెనే చూస్తూ చూస్తూ, ఆమెతో మాట్లాడుతూ మాట్లాడుతూ, తనకు తెలియకుండా ప్రేమించేశాడు. ఆ విధంగా తన జీవితాన్ని కూడా ఆమె అంత అందంగా మార్చుకున్నాడు. ఆ కుర్రాడు నాగచైతన్య. అతని లవర్ మంజిమా మోహన్. గౌతమ్‌వాసుదేవ మీనన్ దర్శకత్వంలో కోన వెంకట్ సమర్పణలో ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిరియాల రవీందర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

నిర్మాత  మాట్లాడుతూ -‘‘యాక్షన్ నేపథ్యంలోని ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఇది. గౌతమ్ మీనన్, నాగచైతన్య, ఎ.ఆర్. రెహమాన్ కాంబినేషన్లో రూపొందిన ‘ఏ మాయ చేశావె’ మనసులకు హత్తుకుంది. మళ్లీ ఆ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం ఆఖరి షెడ్యూల్ ప్రస్తుతం చెన్నైలో జరుగుతోంది.  వచ్చే నెలలో పాటలను, డిసెంబరులో చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement