ఒకేసారి రెండు సినిమాలు చేస్తున్న యంగ్ హీరో | Naga chaitanya New Movie First schedule completed | Sakshi
Sakshi News home page

ఒకేసారి రెండు సినిమాలు చేస్తున్న యంగ్ హీరో

Published Sat, Mar 11 2017 1:06 PM | Last Updated on Sun, Jul 14 2019 4:05 PM

ఒకేసారి రెండు సినిమాలు చేస్తున్న యంగ్ హీరో - Sakshi

ఒకేసారి రెండు సినిమాలు చేస్తున్న యంగ్ హీరో

ప్రేమమ్ సినిమా సక్సెస్తో ఫాంలోకి వచ్చిన నాగచైతన్య స్పీడు పెంచాడు. ఆ తరువాత చేసిన సాహసం శ్వాసగా సాగిపో ఆశించిన స్ధాయిలో ఆకట్టుకోకపోయినా.. చైతూ జోరు మాత్రం తగ్గలేదు. ఇప్పటికే సోగ్గాడే చిన్ని నాయన ఫేం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న ఈ యంగ్ హీరో సైలెంట్గా మరో సినిమా పనులు కూడా ముగించేస్తున్నాడు. ఇప్పటి వరకు అఫీషియల్గా ఒక్క అప్ డేట్ కూడా ఇవ్వకుండానే ఒక షెడ్యూల్ షూటింగ్ ముగించేశాడు.

ఈ విషయాన్ని ఆ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్ ఎస్ ఎస్ కార్తీకేయ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. దర్శకధీరుడు రాజమౌళి తనయుడు కార్తికేయ బాహుబలి సినిమాకు పనిచేస్తూనే బిజినెస్మేన్ గానూ దూసుకుపోతున్నాడు. ఇప్పటికే పలు చిత్రాల ప్రచార బాధ్యతలను నిర్వహిస్తున్న కార్తీకేయ, కృష్ణ మరియముత్తు దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న సినిమాకు లైన్ ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాను సాయి కొర్రపాటి నిర్మిస్తున్నాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement