నో ఫైటింగ్స్‌! | Naga Chaitanya, Samantha to tie the knot on October 6 | Sakshi
Sakshi News home page

నో ఫైటింగ్స్‌!

Published Thu, Aug 10 2017 11:58 PM | Last Updated on Sun, Sep 17 2017 5:23 PM

నో ఫైటింగ్స్‌!

నో ఫైటింగ్స్‌!

‘చూడ చక్కని జంట’... నాగచైతన్య–సమంతలకు చాలామంది ఇచ్చే కితాబులివి. మరి ఈ ఇద్దరూ ఒకరికి మరొకరు ఇచ్చుకునే కితాబుల సంగతేంటి? అంటే ‘చై.. (నాగచైతన్యను అలానే పిలుస్తారు) చాలా మంచి అబ్బాయి’ అంటారు సమంత. నాగచైతన్య అయితే ఇటీవల ఓ కార్యక్రమంలో ‘ప్రపంచంలో ఒక గొప్ప వ్యక్తి’ అని సమంత గురించి చెప్పారట. అది మాత్రమే కాదు.. సమంతకన్నా అందమైన అమ్మాయి లేదని కూడా అన్నారు.

ఆ సంగతలా ఉంచితే చైతూ–సమంతల పర్సనల్‌ లవ్‌ లైఫ్‌ని ఆన్‌ స్క్రీన్‌ మీద చూడాలని చాలామందికి ఉంటుంది. ఆ అవకాశం లేకపోలేదు. ఎందుకంటే, తమ లవ్‌ లైఫ్‌తో సినిమా అంటే ఒప్పుకుంటానని కూడా ఆ కార్యక్రమంలో చైతూ అన్నారట. ఇద్దరూ గొడవపడుతుంటారా? అనే ప్రశ్నకు... ‘‘కోపం వస్తే సీరియస్‌గా చూస్తుంది కానీ, నో ఫైటింగ్స్‌’’ అని కూడా చైతూ పేర్కొన్నారట. అక్టోబర్‌లో నాగచైతన్య–సమంతల వివాహం జరగనున్న విషయం తెలిసిందే. మ్యారేజ్‌ కోసం షాపింగ్‌ మొదలుపెట్టారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement