సమంత పెళ్లి చీరపై ఇంట్రస్టింగ్ న్యూస్..! | Samantha to wear Naga chaitanyas Grandmother Saree | Sakshi
Sakshi News home page

సమంత పెళ్లి చీరపై ఇంట్రస్టింగ్ న్యూస్..!

Published Wed, Aug 2 2017 1:35 PM | Last Updated on Sun, Sep 17 2017 5:05 PM

సమంత పెళ్లి చీరపై ఇంట్రస్టింగ్ న్యూస్..!

సమంత పెళ్లి చీరపై ఇంట్రస్టింగ్ న్యూస్..!

నాగచైతన్య, సమంతల వివాహం గోవాలో అక్టోబర్ 6 నుంచి 9 వరకు జరుగనుందన్న విషయం తెలిసిందే.  అంతేకాదు ఈ పెళ్లిని రెండు సంప్రదాయాల ప్రకారం జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొదట క్రిస్టియన్ పద్దతిలో చర్చిలో, తరువాత తెలుగు సంప్రదాయం ప్రకారం జరుగుతుంది. కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారట.

ఇప్పటికే పెళ్లి సమయంలో వధూవరులు ధరించే దుస్తులను ప్రముఖ డిజైనర్ క్రిషా బజాజ్ డిజైన్ చేస్తున్నట్టు సమాచారం. తాజాగా సమంత పెళ్లి చీర గురించి ఒక ఆసక్తికరమైన విషయం తెలిసింది. వివాహ సమయంలో సమంత కట్టుకోబోయే చీర నాగచైతన్య అమ్మమ్మ గారిది అన్న ప్రచారం జరుగుతోంది. అంటే మూవీ మొఘల్ డి రామానాయుడు భార్య రాజేశ్వరిది దేవి చీరను సమంత పెళ్లి కోసం కట్టుకుంటోందట.

ఆ పాత చీరపై బంగారు జరీ అంచుతో వర్క్ చేసి సరికొత్తగా ఆవిష్కరించేందుకు క్రిషా బజాజ్ చాలా వర్క్ చేస్తోంది. గతంలో సమంత ఎంగేజ్మెంట్ చీర విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని డిజైన్ చేయించారు. అలాగే పెళ్లి నగలను కూడా ఓ ప్రముఖ జ్యువెలరీ సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ వార్తలపై అక్కినేని కుటుంబ సభ్యులు స్పందించకపోయినా.. ఫిలిం సర్కిల్స్ లో సోషల్ మీడియాలో ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement