
భూపేన్.. నవాజుద్దీన్
సుప్రసిద్ధ అస్సామీ గాయకుడు భూపేన్ హజారికా జీవితాన్ని ఆయన సన్నిహితురాలు, బాలీవుడ్ దర్శకురాలు కల్పనా లాజ్మీ తెరకెక్కించనుంది. ఈ చిత్రంలో హజారికా పాత్ర కోసం ఆమె నవాజుద్దీన్ సిద్ధికీని సంప్రదించినట్లు సమాచారం. సిద్ధికీ ప్రస్తుతం స్క్రిప్టు చదవడంలో బిజీగా ఉంటే, లాజ్మీ స్క్రీన్‌ప్లే రూపకల్పనలో తలమునకలుగా ఉన్నారు.ఇందులో లాజ్మీ పాత్రను బెంగాలీ భామ శర్వాణీ ముఖర్జీ పోషించనుంది.