శింబుతో నయనతార రహస్య వివాహం!
ఇది వాస్తవం అనుకుంటే పప్పులో కాలేసినట్టే. తాజాగా శింబు, నయనతార కలిసి నటిస్తున్న చిత్రంలోని ఓ సన్నివేశం కోసం పెళ్లి చేసుకున్నారు. కథలో భాగంగా ఈ చిత్రంలో వీరిద్దరూ ఒక్కసారి కాదు.. మొత్తం నాలుగు సార్లు రహస్యం పెళ్లి చేసుకున్నారంట. ఎవ్వరికి తెలియకుండా నయన, శింబులు హిందూ, క్రిస్టియన్ పద్దతిలోనే కాకుండా ఇతర పద్దతుల్లో పెళ్లి చేసుకునే సీన్ ఇటీవల చిత్రీకరించినట్టు సమాచారం.
ఒకప్పుడు నయనతార, శింబు గాఢంగా ప్రేమించుకున్న సంగతి తెలిసిందే. ఆతర్వాత వీరిద్దరీ ప్రేమకు బ్రేక్ పడింది. అయితే చాలా కాలం తర్వాత వీరిద్దరూ తమిళ దర్శకుడు పాండిరాజ్ దర్శకత్వంలో నటిస్తున్నారు. అయితే గతంలో విబేధాలను మరిచిపోయి.. ఈ చిత్ర షూటింగ్ లోకేషన్ లో నయన్, శింబులు చాలా సన్నిహితంగా ఉంటున్నారట. అంతేకాకుండా వీరిద్దరీ మధ్య రిలేషన్ చూస్తూంటే పాత రోజులు గుర్తుకు వస్తున్నాయని చెన్నైలో టాక్.