
నయనతార ప్రధాన పాత్రలో తెరకెక్కిన మలయాళ చిత్రం ‘ఎలెక్ట్ర’. శ్యామ్ ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మలయాళంలో ఘన విజయం సాధించింది. ఈ సినిమాని ‘లేడీ టైగర్’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. సి.ఆర్. రాజన్ సమర్పణలో సురేశ్ సినిమా పతాకంపై సురేశ్ దూడల తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘మా సినిమాలో ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ మనీషా కొయిరాలా ముఖ్య పాత్ర పోషించారు. విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ద్విపాత్రాభినయం చేశారు. బిజూ మీనన్ మరో మంచి పాత్ర చేశారు. నయనతార, మనీషా కొయిరాలా, ప్రకాశ్ రాజ్‌ల నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలు. అనువాద కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలోనే సెన్సార్ చేయించి, విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: సరోజ సురేశ్, మాటలు: రాజశేఖర్ రెడ్డి, పాటలు: శ్రీరామ్మూర్తి.