ప్రియుడితో కుంభకోణానికి..
నయనతార నటిగానే కాదు వ్యక్తిగతంగానూ వార్తలోకి ఎక్కడం అన్నది పరిపాటిగా మారింది. ఈ ముద్దుగుమ్మ తాజా ప్రియుడు దర్శకుడు విఘ్నేశ్‌శివ అనే ప్రచారం మీడియాలో హోరెత్తుతున్న విషయం తెలిసిందే. నానుమ్ రౌడాదాన్ చిత్రం షూటింగ్ సమయంలో పరిచయమైన వారి మధ్య పరిచయం ప్రేమగా మారిందని, త్వరలో పెళ్లికి సిద్ధం అవుతున్నారని రకరకాల వదంతులు హల్‌చేస్తున్నాయి. విఘ్నేశ్‌శివ, నయనతార షూటింగ్‌లేని సమయాల్లో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
వీటిని బలపరచేలా ఇటీవల ఈ ప్రేమ జంట కుంభకోణంలో వెలిచారట. కారణం ఏమిటన్న విషయాన్ని ఆరా తీసిన కోలీవుడ్ వర్గాలకు తెలిసిందేమిటంటే విఘ్నేశ్‌శివ నటుడు సూర్య హీరోగా తానా సేంద కూటం అనే చిత్రాన్ని తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారు. ఇందులో సూర్యకు జంటగా నయనతార నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మించనుంది. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించాలని కోరుతూ విఘ్నేశ్‌శివ, నయనతార కలిసి కుంభకోణం వెళ్లి అక్కడి స్వామిని దర్శించుకుని వచ్చినట్లు సమాచారం.