kumbakonam
-
అగ్రిగోల్డ్ బూచి... ప్రత్తిపాటి భూముల లాలూచీ
సాక్షి, అమరావతి: సామాన్య డిపాజిటర్లను నిండా ముంచేసిన అగ్రిగోల్డ్ కుంభకోణం మాటున టీడీపీ పెద్దలు కొల్లగొట్టిన భూములపై ప్రభుత్వం కొరఢా ఝళిపించింది. అందులో మొదటి అడుగుగా టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా చేసిన ప్రత్తిపాటి పుల్లారావు కుటుంబం అగ్రిగోల్డ్ నుంచి కొల్లగొట్టిన భూములను అటాచ్ చేయాలని నిర్ణయించింది. పుల్లారావు కుటుంబానికి చెందిన 6.19 ఎకరాలను అటాచ్ చేసేందుకు సీఐడీకి అనుమతిస్తూ హోమ్ శాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అగ్రిగోల్డ్ కుంభకోణాన్ని ఆసరాగా చేసుకొని టీడీపీ నేతలు ఆ సంస్థకు చెందిన భూములను కొల్లగొట్టారు. ప్రత్తిపాటి పుల్లారావు కుటుంబం కూడా ఆ భూ దోపిడీలో అడ్డగోలుగా లబ్ధి పొందింది. బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం (అప్పటి ప్రకాశం జిల్లా) గురిజేపల్లిలోని సర్వే నంబర్లు 104/1, 104/3, 104/4, 104/5, 104/6, 103/2లో ఉన్న 6.19 ఎకరాలను హస్తగతం చేసుకుంది. అప్పటికే అగ్రిగోల్డ్ కంపెనీపై కేసు నమోదైంది. ఆ కేసు పేరుతో భయపెట్టి సెటిల్మెంట్ కింద ఆ భూమి తమ పరం చేసేలా డీల్ కుదుర్చుకున్నారు. అగ్రిగోల్డ్ డైరెక్టర్‌గా వ్యవహరించిన కనుకొల్లు ఉదయ్ దినకర్ పేరిట ఉన్న ఆ 6.19 ఎకరాలను పుల్లారావు భార్య తేనే వెంకాయమ్మ పేరిట బదిలీ చేశారు. ఈమేరకు గుంటూరు జిల్లా చిలకలూరిపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 2015లో రిజిస్ట్రేషన్ చేయించారు. అనంతరం గుట్టు చప్పుడు కాకుండా ఆ భూములను కామేపల్లి లక్ష్మీ ప్రసాద్, చెరుకూరి కోటేశ్వరరావు, కామేపల్లి గ్రానైట్స్ పేరిట బదిలీ చేసేశారు. ఈ విధంగా అగ్రిగోల్డ్ భూములను హస్తగతం చేసుకున్నారు. అటాచ్‌మెంట్‌కు అనుమతి ఈ కేసు దర్యాప్తును సీఐడీ అధికారులు వేగవంతం చేశారు. డిపాజిటర్ల నిధులతో అగ్రిగోల్డ్ కంపెనీ కొనుగోలు చేసిన భూములను ప్రత్తిపాటి పుల్లారావు కుటుంబం దక్కించుకుందని గుర్తించారు. దాంతో ఆ భూములను అటాచ్ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు సీఐడీ పంపిన ప్రతిపాదనలను హోమ్ శాఖ ఆమోదించి అటాచ్‌మెంట్‌కు అనుమతి జారీ చేసింది. -
కులదైవం సేవలో నయన్, విఘ్నేశ్.. వీడియో వైరల్
నటి నయనతా, విఘ్నేశ్ శివన్ దంపతులు బుధవారం ఉదయం తమ కులదైవాన్ని దర్శించుకున్నారు. వివరాలు.. గత ఏడాది అక్టోబర్ 9న సరోగసీ విధానం ద్వారా వీరు కవల పిల్లలకు తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. కాగా ఆ పిల్లలకు ఇటీవల ఒక వేదికపై ఉయిర్ రుద్రోనీల్ ఎన్.శివన్, ఉలగ్ దైవీక్ ఎన్.శివన్ అనే పేర్లు పెట్టినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ దంపతులు బుధవారం ఉదయం తంజావూర్ జిల్లా పాపనాశం సమీపంలోని కులదైవం మేలవళత్తూర్ ఆట్రంగరై శ్రీ కాంచి కామాక్షి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా తమ పిల్లల నామకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ పిల్లల శ్రేయస్సు కోసం తమ చిత్రాల విజయాల కోసం ప్రార్థించి ప్రత్యేక పూజలు చేశారు. ప్రస్తుతం నయనతార హిందీలో అట్లీ దర్శకత్వంలో షారూఖ్‌ఖాన్‌కు జంటగా జవాన్ చిత్రంలో నటిస్తున్నారు. త్వరలో తన 75వ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. వీటితో పాటు నటుడు లారెన్స్ కథానాయకుడిగా నటించనున్న చిత్రంలోనూ నటించడానికి పచ్చజెండా ఊపారు. ఈ చిత్రాన్ని దర్శకుడు లోకేశ్‌కనకరాజ్ నిర్మించనున్నారు. అదేవిధంగా దర్శకుడు విఘ్నేశ్ శివన్ అజిత్ హీరోగా చేయాల్సిన చిత్రం చేజారిపోయిన విషయం తెలిసిందే. తాజాగా నటుడు కమలహాసన్ నిర్మించనున్న చిత్రానికి దర్శకత్వం వహించడానికి సిద్ధం అవుతున్నట్లు, ఇందులో దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. @VigneshShivN #Nayanthara #trichy 🥰💖🔥 pic.twitter.com/YiokeYK7Gp — JADEJA SYED (@jadeja_syed) April 5, 2023 -
ఆవు దెబ్బకు పరుగులు పెట్టిన మంత్రి
సాక్షి, చెన్నై : కుంభకోణం ఆలయంలో శనివారం మంత్రి దురైకన్నును ఓ ఆవు పరుగులు తీయించింది. వర్షం కోసం శనివారం అన్నాడీఎంకే ఆధ్వర్యంలో పలు ఆలయాల్లో యాగం నిర్వహించారు. కుంభకోణం కుంభేశ్వరన్ ఆలయంలో శనివారం యాగం జరిగింది. ఇందులో వ్యవసాయశాఖా మంత్రి దురైకన్ను, అన్నాడీఎంకే నిర్వాహకులు పాల్గొన్నారు. యాగం జరుగుతున్న సమయంలో ధ్వజస్తంభం సమీపానికి ఒక ఆవు, దూడను తీసుకువచ్చి గోపూజ జరిపేందుకు ఏర్పాట్లు చేశారు. ఆలయంలో వంద మందికి పైగా గుమికూడారు. ఈ గుంపును చూడగానే ఆవు బెదిరిపోయింది. మంత్రి దురైకన్ను ఆవుకు నమస్కరించి గోపూజ జరిపేందుకు నిర్ణయించారు. ఆయన ఆవు వద్దకు వెళుతుండగా ఆయన వెంట అన్నాడీఎంకే కార్యకర్తలు వెళ్లారు. గమనించి ఆవు పరుగులు తీసింది. తనను ఢీకొనేలా వస్తున్న ఆవును చూసి మంత్రి దురైకన్ను భయంతో పరుగులు తీశారు. ఆ ఆవును తీసుకువచ్చిన వ్యక్తి తాడును పట్టుకుని ఆవు వెంట పరుగెత్తాడు. అయినప్పటికీ ఆవు తాడు వదిలించుకుని పరుగుతీసింది. ఇందులో అన్నాడీఎంకే కార్యకర్త తిరువిడైమరుదూర్ విఘ్నేష్ తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని కుంభకోణం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. తర్వాత జరిగిన యాగంలో కూడా మంత్రి భయంతోనే పాల్గొన్నారు. -
‘సత్యం’ స్కామ్‌కు దశాబ్దం... అయినా మారని పరిస్థితి
న్యూఢిల్లీ: సత్యం కంప్యూటర్ స్కామ్ జరిగి దశాబ్ద కాలం దాటిపోయినా ఇప్పటికీ కార్పొరేట్ సంస్థల ఖాతాల్లో వ్యత్యాసాలను గుర్తించేందుకు చాలా సమయం పడుతోందని టెక్ మహీంద్రా చీఫ్ సీపీ గుర్నానీ చెప్పారు. లోపాలకు చెక్ పెట్టేందుకు మరింత మెరుగైన డేటా అనలైటిక్స్ (సమాచార విశ్లేషణ ప్రొగ్రామ్‌లు) అవసరమని అభిప్రాయపడ్డారు. సత్యం కంప్యూటర్స్ ఖాతాల్లో అక్రమాల కుంభకోణం 2009 జనవరిలో వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో సత్యం కంప్యూటర్స్‌ను టెక్ మహీంద్రా కొనుగోలు చేసి విలీనం చేసుకుంది. వ్యత్యాసాల గురించి అప్రమత్తం చేసేందుకు మన వ్యవస్థలు ఇప్పటికీ ఎక్కువ సమయం తీసుకుంటున్నాయని, అవే సంక్షోభాలకు దారితీస్తున్నాయని గుర్నాని పేర్కొన్నారు. ‘‘అందరు భాగస్వాములు... బ్యాంకులు, రుణాలిచ్చే సంస్థలు, కంపెనీలు మరింత బాధ్యతాయుతంగా ఉండాలి. సత్యం, ఐఎల్ఎఫ్ఎస్ తరహా సంక్షోభాలు తలెత్తకుండా చూసేందుకు, లోపాలను గుర్తించేందుకు మెరుగైన డేటా అనలైటిక్స్, డాష్‌బోర్డులు అవసరం ఉంది. మనమంతా తెలివైన వాళ్లమే. కానీ మనకు మెరుగైన విధానాలు, వ్యవస్థలు కావాలి’ అని గుర్నాని అభిప్రాయపడ్డారు. చిత్రంగా నాడు సత్యం ప్రమోటర్లకు చెందిన మేటాస్ ఇన్ఫ్రాను సొంతం చేసుకున్న ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ కూడా సంక్షోభంలో చిక్కుకుపోవడం గమనార్హం. రూ.94,000 కోట్లకు పైగా రుణభారంతో దివాలా దశకు చేరిన ఈ గ్రూపు నిర్వహణను ప్రభుత్వం ఇటీవలే తన ఆధీనంలోకి తీసుకుంది. వాటాదాలకు ఎనిమిది రెట్ల ప్రలిఫలం... సత్యం కంప్యూటర్స్‌ను సొంతం చేసుకున్న నాటి నుంచి చిన్న ఇన్వెస్టర్లకు ఎనిమిది రెట్ల ప్రతిఫలాన్ని అందించినట్టు టెక్ మహీంద్రా పేర్కొంది. ‘‘2009 ఏప్రిల్‌లో రూ.830 కోట్ల పెట్టుబడిపై రూ.6,614 కోట్ల ప్రతిఫలితాన్ని అందించాం. ఇందులో రూ.332 డివిడెండ్ (ఒక్కో ఇన్వెస్టర్) కూడా ఉంది. చిన్న ఇన్వెస్టర్లకు ఇది సుమారుగా ఎనిమిది రెట్ల ప్రతిఫలం’’ అని సీపీ గుర్నాని వివరించారు. సత్యం కంప్యూటర్స్ వ్యాపారాన్ని తిరిగి పూర్వపు స్థితికి తీసుకురావడానికి, క్లయింట్లలో భరోసా కల్పించేందుకు ఎంతో కృషి చేసినట్టు చెప్పారు. -
ఎవ్వరినీ వదలను
కోల్‌కతా/ఛురబంధర్/రాయ్‌పూర్: శారదా చిట్‌ఫంట్ కుంభకోణంలో దోషులకు బెంగాల్ సీఎం మమత అండగా నిలుస్తున్నారని ప్రధాని మోదీ ఆరోపించారు. ఈ వ్యవహారంలో నేరస్తులతో పాటు వారికి అండగా నిలిచేవారిని విడిచిపెట్టబోమన్నారు. మా–మాటి–మనుష్(కన్నతల్లి–మాతృభూమి–సామాన్యుడు) నినాదంతో అధికారంలోకి వచ్చిన తృణమూల్ కాంగ్రెస్.. కమ్యూనిస్టుల నుంచి హింసను, వేధింపులను అందిపుచ్చుకుందని విమర్శించారు. బెంగాల్‌లోని జల్పాయ్గురి జిల్లాలో శుక్రవారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మమతా బెనర్జీతో పాటు విపక్షాలతీరును మోదీ తీవ్రంగా తప్పుపట్టారు. కమ్యూనిస్ట్ పార్ట్–2గా మారిపోయారు.. ‘మహాకూటమి పేరుతో ఏకమవుతున్న రాజకీయ పార్టీలకు సిద్ధాంతపరమైన ఏకాభిప్రాయం, దేశ భవిష్యత్ గురించి దార్శనికత లేదు. ఇది మహాకూటమి కాదు.. మహా కల్తీ కూటమి. అవినీతిపరులను కాపాడేందుకు సాక్షాత్తూ ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి(మమతా బెనర్జీ) ధర్నాకు కూర్చోవడాన్ని దేశ చరిత్రలో ఎన్నడూ చూడలేదు. శారదా చిట్‌ఫండ్ కుంభకోణం విచారణలో నిర్లక్ష్యం వహించినవారికి మద్దతుగా మమత ఎందుకు ధర్నాకు దిగారో పేదప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. ఈ కుంభకోణంలో నేరస్తులు కావొచ్చు.. లేదా వారిని కాపాడుతున్నవారు కావొచ్చు.. ఈ కాపలాదారు(చౌకీదార్) ఎవ్వరినీ విడిచిపెట్టడు’ అని స్పష్టం చేశారు. వామపక్ష పార్టీల హింసను అందిపుచ్చుకున్న తృణమూల్ ప్రభుత్వం ‘కమ్యూనిస్ట్ పార్ట్–2’గా మారిపోయిందని దుయ్యబట్టారు. చొరబాటుదారులైనా ఓకే ‘బెంగాల్ ప్రభుత్వం బీజేపీ నేతల ర్యాలీలను, హెలికాప్టర్ల ల్యాండింగ్‌ను సైతం అడ్డుకుంటోంది. ఇక్కడి ప్రభుత్వం విదేశీ చొరబాటుదారుల్ని అయినా స్వాగతిస్తుందేమో కానీ, స్వామి వివేకానంద సిద్ధాంతాలను అనుసరించే బీజేపీ నేతల ర్యాలీలకు అనుమతి నిరాకరిస్తోంది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి పరిస్థితేంటి? ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్ జిల్లా కొడతరయ్లో మరో సభలో ప్రసంగిస్తూ..‘రుణమాఫీ విషయంలో ఛత్తీస్ రైతులను కాంగ్రెస్ మోసం చేసింది. కాంగ్రెస్ సర్కారు కేవలం గ్రామీణ, సహకార బ్యాంకుల్లో రైతులు తీసుకున్న రుణాలనే మాఫీ చేసింది. జాతీయ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న రైతుల పరిస్థితి ఏంటి?’ అని ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో ఛత్తీస్‌గఢ్‌ను ఏటీఎంలా వాడుకోవాలని అనుకుంటున్నారు కాబట్టే కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐకి సమ్మతి ఉత్తర్వులను ఉపసంహరించుకుందని విమర్శించారు. శుక్రవారం అస్సాంలోని గువాహటికి చేరుకున్న మోదీకి నిరసనల సెగ ఎదురైంది. కేంద్రం తెస్తున్న పౌరసత్వ సవరణ బిల్లును నిరసిస్తూ ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ సభ్యులు నల్ల జెండాలతో మోదీకి నిరసన తెలిపారు. మోదీ గో బ్యాక్, పౌరసత్వ బిల్లును రద్దుచేయండి, అస్సాం వర్ధిల్లాలి అని నినాదాలతో హోరెత్తించారు. మిస్టర్ మ్యాడీ..! బెంగాల్ పర్యటనలో భాగంగా మోదీ కలకత్తా హైకోర్టు సర్క్యూట్ బెంచ్‌ను జల్పాయ్గురిలో ఆవిష్కరించారు. కేంద్రం 13–14 ఏళ్ల క్రితమే అనుమతులు ఇచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సర్క్యూట్ బెంచ్‌ను ఏర్పాటు చేయలేదని మోదీ విమర్శించారు. ఈ బెంచ్వల్ల డార్జిలింగ్, కలింగ్పొంగ్, జల్పాయ్గురి జిల్లాల ప్రజలకు లబ్ధి చేకూరుతుందనీ, వీరందరికీ 100 కి.మీ పరిధిలోనే హైకోర్టు సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. కాగా, సర్క్యూట్ బెంచ్ ప్రారంభోత్సవం గురించి రాష్ట్ర ప్రభుత్వానికి, హైకోర్టుకు కేంద్రం సమాచారం ఇవ్వలేదని బెంగాల్ సీఎం మమత మండిపడ్డారు. ఇందుకోసం స్థలం కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వమనీ, బెంచ్ కలకత్తా హైకోర్టుకు సంబంధించినదని గుర్తుచేశారు. ఈ సందర్భంగా మోదీని మిస్టర్ మ్యాడీ(పిచ్చివాడి)గా అభివర్ణించారు. ప్రధాని వ్యవహారశైలి పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు లేకపోయినప్పటికీ బ్యాండ్ మేళంవాడు తొందరపడి వచ్చినట్లు ఉంద న్నారు. తమకు ప్రధాని కుర్చీపై గౌరవం ఉందనీ, ఈ వ్యక్తి(మోదీ)పై మాత్రం లేదన్నారు. కోల్‌కతా ధర్నాలో తనతో కలిసి పాల్గొన్న సీనియర్ పోలీస్ అధికారుల మెడల్స్‌ను కేంద్రం వెనక్కు తీసుకుంటే.. ఆ అధికారులకు రాష్ట్ర అత్యున్నత పురస్కారం ‘బంగ బిభూషణ్’ అందజేస్తానని చెప్పారు. -
మహిళ గుండె భాగంలో సూది
టీ.నగర్(తమిళనాడు): వైద్యుల నిర్లక్ష్యం గర్భిణి ప్రాణాల మీదకు తెచ్చింది. చేతికి ఇంజెక్షన్ వేస్తుండగా విరిగిన సూదిని వెంటనే తీయకపోవడంతో సూది గుండె వరకు వెళ్లింది. తమిళనాడులోని కుంభకోణం సమీపంలోని గోవిందపురానికి చెందిన వడివేలు భార్య శశికళ (23) దంపతులకు ఇద్దరు పిల్లలు. కొన్ని రోజుల కిందట శశికళ జ్వరంతో కుంభకోణం ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. అక్కడ నర్సులు ఆమెకు ఇంజెక్షన్ వేయగా సూది విరిగిపోయి శశికళ చెయ్యి లోపలి భాగంలో ఉండిపోయింది. ఇంటికి వెళ్లిన శశికళకు చేతి నొప్పి ఎక్కువైంది. ఆస్పత్రికి వెళ్లి ఎక్స్‌రే తీసి చూడగా విరిగిన సూది చేతిలోపలి భాగంలో ఉన్నట్లు తేలింది. తంజావూరు వైద్య కళాశాల ఆస్పత్రిలో శస్త్ర చికిత్స చేయించుకోగా ఆ సమయంలో వైద్యులు సూదిని తొలగించినట్లు చెప్పారు. మూడు నెలల గర్భిణి అయిన శశికళకు శుక్రవారం గుండెనొప్పి వచ్చింది. దీంతో ఇంటి సమీపంలో ఉన్న డాక్టర్ వద్ద ఎక్స్‌రే తీసి చూడగా చేతిలో విరిగిన సూది గుండె వద్దకు చేరుకున్నట్లు తెలిసింది. దీనిపై శశికళ మాట్లాడుతూ.. వైద్యులు సూదిని తొలగించామని చెప్పి మోసగించారని.. సూది గుండె వద్దకు చేరుకుని ప్రాణాల మీదకు వచ్చిందని కన్నీటిపర్యంతమైంది. -
కుంభకోణం కేసులో దోషులకు ఊరట
చెన్నై: కుంభకోణం స్కూల్ పిల్లల సజీవ దహనం కేసులో దోషులకు ఊరట లభించింది. ఏడుగురి శిక్షలను రద్దు చేస్తూ గురువారం మద్రాస్ హైకోర్టు తీర్పు వెలువరించింది. మరో ఇద్దరికి విధించిన శిక్షలను జరిమానా రూపంలోకి మారుస్తూ ఆదేశాలు జారీచేసింది. కేసులో మొత్తం 21 మంది నిందితుల పేర్లను పోలీసులు ఛార్జీషీటులో చేర్చగా, జూలై 11, 2014న దిగువ న్యాయస్థానం 11 మందిని నిర్దోషులుగా పేర్కొంటూ.. మిగతావారికి శిక్షలు ఖరారు చేసింది. పాఠశాల వ్యవస్థాపకుడు పులవార్ పళనీస్వామికి జీవితఖైదు, ఆయన భార్య సరస్వతికి ఐదేళ్ల జైలుశిక్ష విధించింది. సుమారు 13 ఏళ్లపాటు జరిగిన వాద, ప్రతివాదనల అనంతరం వంటమనిషి వాసంతికి మాత్రం శిక్షను ఖరారుచేస్తూ.. మిగతా 9మందిని మద్రాస్ హైకోర్టు నిర్దోషులుగా పేర్కొంటూ తీర్పు వెలువరించింది. 'గుండెలు బద్ధలయిపోతున్నాయి. మా పిల్లల్ని పొట్టనబెట్టుకున్న హంతకులకు న్యాయస్థానం స్వేచ్ఛగా బయటకు వదిలేసింది. చనిపోయిన పిల్లల వయసు ఐదు నుంచి తొమ్మిదేళ్ల లోపలే వాళ్లే. ప్రభుత్వం దీనిపై అప్పీల్‌కు వెళ్తుంద'ని ఆశిస్తున్నట్టు ఆ ఘటనలో చనిపోయిన ఓ పిల్లాడి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. తంజావూర్ జిల్లాలోని కుంభకోణంలో జూలై 16, 2004న కృష్ణమూర్తి పాఠశాలలో వంటగదిలో అగ్నిప్రమాదం చెలరేగి పాఠశాల మొత్తానికి వ్యాపించింది. స్కూల్ మొత్తానికి ఒకే ద్వారం ఉండటంతో గందరగోళం నెలకొని 94 మంది విద్యార్థులు, ఒక టీచర్ సజీవ దహనం అయ్యారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా పాఠశాలల భద్రతపై అప్పట్లో చర్చకు దారితీసింది. -
ప్రియుడితో కుంభకోణానికి..
నయనతార నటిగానే కాదు వ్యక్తిగతంగానూ వార్తలోకి ఎక్కడం అన్నది పరిపాటిగా మారింది. ఈ ముద్దుగుమ్మ తాజా ప్రియుడు దర్శకుడు విఘ్నేశ్‌శివ అనే ప్రచారం మీడియాలో హోరెత్తుతున్న విషయం తెలిసిందే. నానుమ్ రౌడాదాన్ చిత్రం షూటింగ్ సమయంలో పరిచయమైన వారి మధ్య పరిచయం ప్రేమగా మారిందని, త్వరలో పెళ్లికి సిద్ధం అవుతున్నారని రకరకాల వదంతులు హల్‌చేస్తున్నాయి. విఘ్నేశ్‌శివ, నయనతార షూటింగ్‌లేని సమయాల్లో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. వీటిని బలపరచేలా ఇటీవల ఈ ప్రేమ జంట కుంభకోణంలో వెలిచారట. కారణం ఏమిటన్న విషయాన్ని ఆరా తీసిన కోలీవుడ్ వర్గాలకు తెలిసిందేమిటంటే విఘ్నేశ్‌శివ నటుడు సూర్య హీరోగా తానా సేంద కూటం అనే చిత్రాన్ని తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారు. ఇందులో సూర్యకు జంటగా నయనతార నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మించనుంది. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించాలని కోరుతూ విఘ్నేశ్‌శివ, నయనతార కలిసి కుంభకోణం వెళ్లి అక్కడి స్వామిని దర్శించుకుని వచ్చినట్లు సమాచారం. -
ఉపాధిహమీ పధకంలో నిధులు కుంభకోణం
-
‘కుంభకోణం’ ఘటనలో పదిమందికి జైలు
చెన్నై, సాక్షి ప్రతినిధి: అది తంజావూరు జిల్లా సెషన్స్ జడ్జి కోర్టు.... బుధవారం ఉదయం 8 గంటలు.... సహజంగా న్యాయవాదులు, కక్షిదారులతో ఉండే కోర్టు ప్రాంగణంలో కొత్తగా ఎక్కడ చూసినా కుటుంబాలు. విద్యార్థులు. విషణ్ణ వదనాలతో కొందరు, వారిని ఊరడిస్తూ మరికొందరు. కోర్టు పరిసరాలను డేగకన్నుతో గమనిస్తూ వందలాది మంది పోలీసులు. ఎప్పుడెప్పుడు కోర్టు ప్రారంభవుతుందా అనే ఆతృత, ఎటువంటి తీర్పు వస్తుందోననే ఉత్కంఠ. సమయం 10.30 గంటలు దాటింది. న్యాయమూర్తి మహ్మమద్ అలీ ఆశీనుల య్యూరు. చిన్నారుల సజీవ దహనానికి, ఎందరో తల్లిదండ్రుల కడుపుకోతకు కారణమైన పదిమందికి జైలు శిక్ష విధిం చారు. చిన్నపాటి ఆర్థిక సహాయంతో వారి కన్నీళ్లు తుడిచే ప్రయత్నం చేశారు. మరో 11 మందిని నిర్దోషులుగా విడిచిపెట్టారు. తంజావూరు జిల్లా కుంభకోణం కాశీరామన్ వీధిలో శ్రీ కృష్ణ ప్రాథమిక పాఠశాల, సరస్వతీ పాఠశాల, శ్రీకృష్ణ మహిళా ఉన్నత పాఠశాలలో 2004 జూలై 16వ తేదీ జరిగిన ప్రమాదంపై పదేళ్ల సుదీర్ఘవిచారణ తరువాత తీర్పు వెలువరించారు. ఆ రోజు ఉదయం 200 మంది విద్యార్థులతో పాఠశాల తరగతులు ప్రారంభమయ్యూయి. మధ్యాహ్నం భోజనం వండేందుకు పాఠశాల ప్రాంగణంలోనే ఉన్న వంటశాల నుంచి మంటలు చెలరే గారుు. 94 మంది విద్యార్థులు సజీవ దహనమయ్యూరు. మరో18 మంది కాలిన గాయాలతో బయటపడ్డారు. అప్పట్లో ఈ ప్రమాదం దేశంలోనే కలకలం రేపింది. రాష్ట్రంలో అతిపెద్ద ప్రమాదంగా నమోదైంది. పాఠశాల కరస్పాండెంట్ పళనిస్వామి, ఆయన భార్య, కరస్పాండెంట్ సరస్వతి, ప్రధానోపాధ్యాయురాలు శాంతలక్ష్మి తదితరులతోపాటూ విద్యాశాఖకు చెందిన పలు అధికారులను కలుపుకుని మొత్తం 24 మందిపై పది సెక్షన్ల కింద కుంభకోణం పోలీసులు కేసు నమోదు చేశారు. సంఘటన జరిగినపుడు అందరినీ అరెస్ట్ చేయగా బెయిల్‌పై వచ్చారు. ఈ కేసుకు సంబంధించి 2005లో కుంభకోణం కోర్టులో చార్జిషీటు దాఖలైంది. నిందితులకు 2006లో చార్జిషీటు ప్రతులను అందజేశారు. నిందితుల్లో పాఠశాల కరస్పాండెంట్ పళనిస్వామి అల్లుడు, పాఠశాల మాజీ ప్రధానోపాధ్యాయులు ప్రభాకరన్ అప్రూవర్లుగా మారారు. విద్యాశాఖ డెరైక్టర్ కన్నన్, సీఈవో ముత్తుపళనిస్వామి, తహశీల్దారు పరమశివంను హైకోర్టు విడిచిపెట్టింది. ఈ కేసులో ఇప్పటి వరకు 512 మంది సాక్షులను విచారించారు. ఈనెల 31వ తేదీలోగా కేసు విచారణను పూర్తిచేసి తీర్పు చెప్పాలని ఈ ఏడాది మే 5వ తేదీన సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ మేరకు తంజావూరు జిల్లా మొదటిశ్రేణి మేజిస్ట్రేటు మహ్మమద్ ఆలీ తుది తీర్పు చెప్పే ముందు నిందితులను విచారించారు. చార్జిషీటులోని 21 మందిలో 11 మందిని నిర్దోషులుగా ఆయన ప్రకటించారు. పాఠశాల నిర్వహణలో సర్వం తానై అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన పాఠశాల యజమాని పళనిస్వామిని కోర్టు ప్రధానంగా తప్పుపట్టింది. పళని స్వామికి యావజ్జీవ శిక్షను విధిస్తున్నట్లు న్యాయమూర్తి చెప్పారు. అంతేగాక మృతి చెందిన 94 మంది విద్యార్థుల తరపున ఒక్కో విద్యార్థికి పదేళ్ల చొప్పున అంటే 940 ఏళ్ల శిక్షను అనుభవించాలని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఇది సాధ్యం కాదు కాబట్టి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షను ఏకకాలంలో అనుభవించాలని చెప్పారు. రూ.52.57 లక్షల నష్టపరిహారం చెల్లించాలన్నారు. పరిహారం సొమ్మును మృతి చెందిన చిన్నారుల కుటుంబాలకు ఒక్కొరికి రూ.25 వేలు, గాయపడినవారికి రూ.15 వేలు చొప్పున చెల్లించాలని ఆదేశించారు. పాఠశాల యజమాని పళనిస్వామి భార్య, పాఠశాల కరస్పాండెంట్ సరస్వతి, ప్రధానోపాధ్యాయురాలు శాంతలక్ష్మి, మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకురాలు విజయలక్ష్మి, వంటమనిషి వసంతి, ఎలిమెంటరీ ఆఫీసర్ బాలాజీ, అసిస్టెంట్ ఎలిమెంటరీ ఆఫీసర్ శివప్రకాష్, పీఏ దురైరాజ్, రాష్ట్ర ఎలిమెంటరీ ఆఫీసర్ తాండవన్లకు తలా ఐదేళ్లు, ఇంజనీరు జయచంద్రన్కు రెండేళ్ల జైలు శిక్ష విధించారు. నిర్దోషులు జిల్లా ఎలిమెంటరీ పాఠశాల విద్యాశాఖాధికారి బీ పళనిస్వామి, జిల్లా విద్యాశాఖాధికారి ఆర్ నారాయణస్వామి, అసిస్టెంట్ ఎలిమెంటరీ పాఠశాల విద్యాశాఖాధికారులు ఎస్ రాధాకృష్ణన్ , కే బాలకృష్ణన్, మాధవన్, వీ బాలసుబ్రమణ్యన్, ఉపాధ్యాయులు పీ దేవీ, మహాలక్ష్మి, టీ అంతోని, కుంభకోణం మునిసిపల్ కమిషనర్, కుంభకోణం మునిసిపాలిటీ టౌన్‌ప్లానింగ్ ఆఫీసర్ కే మురుగన్ ఈ 11 మందిని నిర్దోషులుగా విడుదల చేశారు. ఆనాటి ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన విద్యార్థులు సైతం కోర్టు ప్రాంగణానికి చేరుకోవడం విశేషం. తీర్పు నిరసనలు కోర్టు ఇచ్చిన తీర్పుపై బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు నిరసన తెలిపాయి. 11మందిని నిర్దోషులుగా విడుదల చేయడంపై తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కోర్టు తీర్పుపై అప్పీలు చేయనున్నట్లు బాధిత తల్లిదండ్రులు ప్రకటించారు. అలాగే ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలు మద్రాసు హైకోర్టు ముందు నిరసన ప్రదర్శన నిర్వహించాయి. -
'40 సార్లు గుండు గీశారు'
తన తలకు కనీసం నలభై సార్లు గుండు కొట్టారని దక్షిణాది నటుడు అభినయ్ వడ్డి వెల్లడించారు. ప్రముఖ భారతీయ గణిత మేధావి శ్రీనివాస రామానుజం చిత్రంలో ముఖ్యపాత్ర పోషిస్తున్న అభినయ్ బుధవారం చెన్నైలో విలేకర్లతో మాట్లాడారు. ప్రముఖ భారతీయ గణిత మేధావి శ్రీనివాస రామానుజం జీవిత కథ ఆధారంగా తమిళ, ఇంగ్లీషు భాషలలో నిర్మితమవుతున్న 'రామానుజన్' చిత్రానికి సంబంధించిన విశేషాలను అభియన్ ఈ సందర్బంగా వెల్లడించారు. ఆ చిత్రంలోని ముఖ్యపాత్ర కోసం గుండుతో కనిపించాల్సి ఉంటుందని ఆ చిత్ర దర్శకుడు తనకు ముందే చెప్పారని తెలిపారు. అందుకు తాను మనస్పూర్తిగా అంగీకరించానని తెలిపారు. దాంతో అన్ని సార్లు గుండు గీస్తారని చెప్పారు. తమిళనాడు కుంభకోణంలో చిత్ర షూటింగ్ జరుగుతున్న సమయంలో భాగంగా క్షరకుడు ఎల్లప్పుడు తనతో ఉండేవాడని ఆయన గుర్తు చేసుకున్నారు. చిత్ర షూటింగ్లో భాగంగా లండన్ వెళ్లినప్పుడు విగ్ పెట్టుకుని తిరగాలని తెగ అరాటపడ్డానని అయితే తన తలకు జుట్టు కొద్దికొద్దిగా వస్తున్న క్రమంలో విగ్ తన తలకు అతకలేదన్నారు. దాంతో విగ్గు పెట్టుకునేందుకు గుండె గీయించుకోవలసి వచ్చిందని షూటింగ్ నాటి విశేషాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కర్పూర సినిమా నిర్మిస్తున్న ఆ చిత్రంలో బామా, సుహాసిని మణిరత్నం, నిళగళ రవి, శరత్ బాబు, విజయ్, అబ్బాస్, ఢిల్లీ గణేష్, వై.జీ మహేంద్రలు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. -
మరో మాటలేదు.. త్వరలోనే తెలంగాణ: దామోదర
త్వరలోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడబోతోందని, ఈ విషయంలో మరో మాట తలెత్తే అవకాశమే లేదని ఆంధ్రప్రదేశ్(ఏపీ) ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ ఉద్ఘాటించారు. ‘తెలంగాణ ఏర్పాటులో రెండో అభిప్రాయానికి తావులేదు. రాష్ట్రం ఏర్పడి తీరుతుంది’ అని ఆయన అన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం స్పష్టమైన నిర్ణయం వెల్లడించిందన్నారు. తమిళనాడులోని కుంభకోణంలో ఉన్న స్వామిమలై మురుగ ఆలయాన్ని బుధవారం ఆయన దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం మీడియాతో పైవిధంగా మాట్లాడారు. ఇదిలావుంటే, ఏపీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి మంగళవారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ, ప్రజల కోరిక మేరకు రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలన్నారు.