దొర‌లో న‌య‌న‌ | Nayanthara's next titled Dora | Sakshi
Sakshi News home page

దొర‌లో న‌య‌న‌

Published Wed, Jul 6 2016 1:19 AM | Last Updated on Mon, Sep 4 2017 4:11 AM

దొర‌లో న‌య‌న‌

దొర‌లో న‌య‌న‌

రియల్‌గానైనా, రీల్‌లోనైనా ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న నటి పేరు నయనతార. ప్రేమ వ్యవహారంలో ప్రకంపనలు పుట్టిస్తున్న ఈ బ్యూటీ నటనాపరంగా సంచలనం కలిగిస్తున్నారు. రీఎంట్రీ తరువాత కూడా టాప్ నాయకిగా వెలుగొందుతున్న అరుదైన నటి నయనతార అనవచ్చు. ఇటు ప్రముఖ కథానాయకులతోనూ ఇటు వర్ధమాన నటులతోనూ నటిస్తూ తన సత్తా చాటుకుంటున్న ఆ కేరళ భామ ప్రస్తుతం కోలీవుడ్‌లో విక్రమ్ సరసన ఇరుముగన్, కార్తీతో కాష్మోరా చిత్రాల్లో నటిస్తున్నారు. వీటితో పాటు ఒక లేడి ఓరియెంటెడ్ చిత్రం కూడా చేస్తున్నారు.

తెలుగులో వెంకటేశ్‌కు జంటగా బాబు బంగారం చిత్రాన్ని పూర్తి చేశారు. త్వరలో మోహన్‌రాజా దర్శకత్వంలో శివకార్తికేయన్‌తో రొమాన్స్‌కు సిద్ధం అవుతున్నారు. అలాగే జయంరవితో మరోసారి జత కట్టనున్నట్లు ప్రచారంలో ఉంది. నయనతార ఇంతకు ముందు నటించిన కథానాయకి ఇతివృత్తంతో కూడిన మాయ చిత్రం అనూహ్య విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఆ చిత్ర దర్శకుడు దాస్ దర్శకత్వంలో తాజాగా మరో చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. నటుడు తంబిరామయ్య, హరీష్‌ఉత్తమ్ ముఖ్య పాత్రలు ధరిస్తున్న ఈ చిత్రానికి వివేక్-మెర్విన్‌ల ద్వయం సంగీతాన్ని దినేశ్ చాయాగ్రహణం అందిస్తున్నారు.

ఈ చిత్రానికి దొర అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు తాజా సమాచారం. ఇది బుల్లి తెరలో ప్రచారం అవుతున్న ఒక పాపులర్ కార్యక్రమం పేరులోని ఒక భాగం అన్నది గమనార్హం. ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. మొత్తం మీద మాయతో ప్రేక్షకులను అలరించిన నయనతార ఈ దొరతో ఏ మేరకు వారి హృదయాలను దోచుకుంటుందో చూద్దాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement