
కిడ్నాప్ అయ్యానోచ్
పోసాని కృష్ణమురళి, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘నేను కిడ్నాప్ అయ్యాను’. శ్రీకర్‌బాబు దర్శకత్వంలో మధుర మూవీస్ పతాకంపై మాధవి అద్దంకి నిర్మించిన ఈ సినిమా సెన్సార్‌కి సిద్ధమైంది. ‘‘కిడ్నాప్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది.
బ్రహ్మానందం, పోసాని, ‘తాగుబోతు’ రమేశ్ పాత్రలు, నటన ప్రేక్షకులను నవ్విస్తాయి. వచ్చే నెలలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు శ్రీకర్ బాబు. ‘‘ఎవరు ఎవర్ని కిడ్నాప్ చేశారనే అంశంతో దర్శకుడు సినిమాను ఆసక్తికరంగా మలిచారు’’ అన్నారు మాధవి అద్దంకి. ‘కార్టూనిస్ట్’ మల్లిక్, పృధ్వీ, తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: శ్రీకాంత్, సమర్పణ: దగ్గుపాటి వరుణ్.