తొమ్మిది చుట్టూ...
అశ్వనీ కుమార్ దర్శకత్వంలో శ్వేతాసింగ్ నిర్మిస్తున్న చిత్రం ‘9’. అతుల్ కులకర్ణి, కబీర్ దుహన్ సింగ్, అర్చన శాస్త్రి, పావనీ గంగిరెడ్డి, ఆషిమా నర్వాల్, శ్రిత చందన ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమా టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ– ‘‘నాకు రెండు నిర్మాణ సంస్థలు ఉన్నాయి.
అందులో ఏకా ఆర్ట్ ప్రొడక్షన్‌లో వస్తున్న తొలి చిత్రం ‘9’. సినిమాను 32 రోజుల్లో తెరకెక్కిద్దామనుకున్నాం. అయితే 27రోజుల్లోనే కంప్లీట్ చేయగలిగాం’’ అన్నారు. నలుగురు ఘోస్ట్ హంటర్స్ ఓ హంటెడ్ హౌస్‌లో దెయ్యాలున్నాయా..? లేవా అని సెర్చ్ చేయడానికి వెళ్లినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయన్నదే చిత్రకథ. సినిమాలో అనేక అంశాలు 9 చుట్టూ తిరుగుతుంటాయి’’ అన్నారు అశ్వనీ కుమార్.