కుమారి శ్రీమతి కానుంది | Niharika is wedding fixed with a Guntur boy | Sakshi
Sakshi News home page

కుమారి శ్రీమతి కానుంది

Published Fri, Jun 19 2020 2:49 AM | Last Updated on Fri, Jun 19 2020 7:54 AM

Niharika is wedding fixed with a Guntur boy - Sakshi

ఇన్‌స్టాలో నిహారిక షేర్‌ చేసిన ఫొటో

‘పెళ్లికి బాజా మోగింది.. కుమారి శ్రీమతి కానుంది’ అని ‘జయం మనదేరా’ సినిమాలో వెంకటేశ్‌ ఆడిపాడారు.   ఇప్పుడు నిహారికాకు ఈ పాట బాగా సూట్‌ అవుతుంది. కుమారి కొణిదెల నిహారిక త్వరలో శ్రీమతి కానున్నారు. నటుడు నాగబాబు కుమార్తె, హీరో వరుణ్‌ తేజ్‌ చెల్లెలిగానే కాదు నటిగా తనకంటూ గుర్తింపు పొందారు నిహారిక. పెళ్లి నిశ్చయమైన విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా తెలిపి, ఒక ఫొటోను కూడా షేర్‌ చేశారు నిహారిక. అయితే కాబోయే భర్త గురించిన వివరాలేమీ చెప్పలేదు.

అబ్బాయిది గుంటూరు అని, హైదరాబాద్‌లోని ఓ ఎమ్‌ఎన్‌సీ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నారని సమాచారం. అలాగే అబ్బాయి తండ్రి పోలీస్‌ శాఖలో ఉన్నతాధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారని తెలిసింది. పెళ్లి వచ్చే ఏడాది జరుగుతుందట. అబ్బాయి పేరు చైతన్య అనే ప్రచారం జరుగుతోంది. ‘ఒక మనసు’ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయిన నిహారిక ‘హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం’ వంటి చిత్రాల్లోనూ నటించారు. అశోక్‌ సెల్వన్‌ హీరోగా నటించనున్న తమిళ చిత్రంలో హీరోయిన్‌గా నటించనున్నారు నిహారిక. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement