‘టైగర్’ దర్శకునితో సినిమా
వైవిధ్యమైన చిత్రాలకు సరికొత్త చిరునామా... నిఖిల్. తాజాగా ఆయన మరో విభిన్న చిత్రానికి పచ్చజెండా ఊపారు. సందీప్ కిషన్ హీరోగా ై‘టెగర్’ చేసిన వి.ఐ. ఆనంద్‌తో ఆయన సినిమా చేయనున్నారు. మేఘన ఆర్ట్స్ పతాకంపై పి.వెంకటేశ్వరరావు నిర్మించనున్న ఈ చిత్రం గురువారం హైదరాబాద్‌లో మొదలైంది. నిర్మాత మాట్లాడుతూ -‘‘ఈ చిత్రాన్ని నిఖిల్ సింగిల్ సిట్టింగ్‌లోనే ఓకే చేశారు. త్వరలోనే టైటిల్ ప్రకటిస్తాం. నవంబర్‌లో షూటింగ్ మొదలుపెడతాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: అబ్బూరి రవి, సంగీతం: శేఖర్‌చంద్ర, సహనిర్మాత: డి. శ్రీనివాస్.