పండగ సెలవు లేదు | No rest to prince mahesh babu | Sakshi
Sakshi News home page

పండగ సెలవు లేదు

Published Wed, Sep 12 2018 12:19 AM | Last Updated on Sun, Apr 7 2019 12:28 PM

No rest to prince mahesh babu - Sakshi

ఈ నెలాఖరున మహేశ్‌బాబు విదేశాలకు వెళ్లనున్నారు. ఫ్యామిలీతో హాలిడే ట్రిప్‌ అనుకునేరు. ఇప్పట్లో నో హాలిడేస్‌.. ఓన్లీ షూటింగ్‌ అనేలా తాజా చిత్రం ‘మహర్షి’కి మహేశ్‌బాబు డేట్స్‌ ఇచ్చారట. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అశ్వనీదత్, ‘దిల్‌’ రాజు, పీవీపీ  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహేశ్‌ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ‘అల్లరి’ నరేశ్‌ ఓ కీలక పాత్ర చేస్తున్నారు.

ఇందులో మహేశ్‌బాబు కొన్ని సీన్స్‌లో కాలేజీ స్టూడెంట్‌గా కనిపించనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో జరుగుతోంది. వినాయక చవితి నాడు కూడా షూటింగ్‌ ప్లాన్‌ చేశారట. సో.. పండగ సెలవు లేనట్లే. నెలాఖరున మరో షెడ్యూల్‌ కోసం విదేశాలు వెళ్లనున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5న ఈ చిత్రం రిలీజ్‌ కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement