ఎన్టీఆర్ 'కత్తి' | NTR to star in Telugu remake of Vijay's Kaththi? | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్ 'కత్తి'

Published Fri, Apr 10 2015 12:03 PM | Last Updated on Sun, Sep 3 2017 12:07 AM

ఎన్టీఆర్ 'కత్తి'

ఎన్టీఆర్ 'కత్తి'

తమిళంలో విడుదలై రికార్డు సృష్టించిన చిత్రం కత్తి.  ఆ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు ఆ చిత్ర దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ సన్నాహాలు చేస్తున్నారు. అందుకోసం టాలీవుడ్ హీరోలను ఎంపిక చేసేందుకు ఆయన గత కొన్ని నెలలుగా తీవ్ర కసరత్తు చేస్తున్నారు. అందులోభాగంగా పలువురు టాలీవుడ్ హీరోలను మురుగదాసు ఇప్పటికే కలసినట్లు సమాచారం. అయితే ఆ చిత్రంలో హీరోగా ఎన్టీఆర్ను మురుగదాస్ ఎంపిక చేసినట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. దీనిపై సాధ్యమైనంత త్వరలో దర్శకుడు మురుగదాస్ ఓ ప్రకటన చేసే అవకాశం ఉందని వారు శుక్రవారం వెల్లడించనున్నారు.

మురుగదాస్ దర్శకత్వంలో విజయ్, సమాంత హీరోహీరోయిన్లుగా నటించిన తమిళ చిత్రం కత్తి. గతేడాది నవంబర్లో విడుదలైన  ఈ చిత్రం రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. కత్తిలో హీరో విజయ్ ద్విపాత్రాభినయం చేశారు. హీరో సొంత ఊరిలోని వ్యవసాయ భూములను ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతుంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ భూములు కోసం హీరో వీరోచితంగా పోరాడే కథాంశంతో దర్శకుడు మురుగదాసు ఈ చిత్రాన్ని రసవత్తరంగా తెరకెక్కించారు.

అయితే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్ర షూటింగ్లో యమబిజీగా ఉన్నారు. వచ్చే నెలలో ఎన్టీఆర్ ఆ చిత్ర షూటింగ్ నిమిత్తం లండన్ వెళ్లనున్నారు. ఆ చిత్రం పూర్తయిన వెంటనే ఎన్టీఆర్ ఈ చిత్రంలో నటిస్తారని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement