పవర్‌ఫుల్‌ జర్నలిస్ట్‌! | okkadu migiladu movie shooting Completed | Sakshi
Sakshi News home page

పవర్‌ఫుల్‌ జర్నలిస్ట్‌!

Published Sun, Apr 30 2017 12:08 AM | Last Updated on Tue, Sep 5 2017 9:59 AM

పవర్‌ఫుల్‌ జర్నలిస్ట్‌!

పవర్‌ఫుల్‌ జర్నలిస్ట్‌!

ఎల్‌టీటీఈ మిలిటెంట్‌ చీఫ్‌ ప్రభాకరన్‌ పాత్రలో మంచు మనోజ్‌ నటిస్తున్న సినిమా ‘ఒక్కడు మిగిలాడు’. అజయ్‌ ఆండ్రూస్‌ నూతక్కి దర్శకుడు. పద్మజ ఫిలిమ్స్‌–న్యూ ఎంపైర్‌ సెల్యులాయిడ్స్‌ సంస్థలపై ఎస్‌.ఎన్‌. రెడ్డి, లక్ష్మీకాంత్‌లు నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ నేటితో పూర్తవుతుంది.

ఈ సందర్భంగా ఇందులో పవర్‌ఫుల్‌ జర్నలిస్ట్‌గా కీలక పాత్ర చేస్తున్న ‘అలియాస్‌ జానకి’ ఫేమ్‌ అనీషా ఆంబ్రోస్‌ ఫస్ట్‌ లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. నిర్మాతలు ఎస్‌.ఎన్‌. రెడ్డి, లక్ష్మీకాంత్‌ మాట్లాడుతూ – ‘‘ఇందులో మంచు మనోజ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇటీవల విడుదలైన మనోజ్‌ ప్రభాకరన్‌ ఫస్ట్‌ లుక్‌కు విశేషమైన స్పందన లభిస్తోంది. త్వరలో మనోజ్‌ మరో పాత్రకు సంబంధించిన లుక్‌ విడుదల చేయాలనుకుంటున్నాం.

 1990ల నాటి శ్రీలంక యుద్ధ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. త్వరలోనే ట్రైలర్, ఆడియో విడుదల తేదీలను వెల్లడిస్తాం’’ అన్నారు. మిలింద్‌ గునాజీ, పోసాని, సుహాసిని, సూర్య, బెనర్జీ, జెన్నిఫర్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కళ: పీఎస్‌ వర్మ, కెమేరా: వి. కోదండ రామరాజు, కూర్పు: కార్తీక శ్రీనివాస్, కథనం: గోపీమోహన్, సంగీతం: శివ నందిగామ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement