12న కబాలి పాటల ఆవిష్కరణ | On 12 Kabali songs innovation | Sakshi
Sakshi News home page

12న కబాలి పాటల ఆవిష్కరణ

Published Sun, Jun 5 2016 3:07 AM | Last Updated on Thu, Sep 12 2019 10:40 AM

12న కబాలి పాటల ఆవిష్కరణ - Sakshi

12న కబాలి పాటల ఆవిష్కరణ

ఒక్క దక్షిణ భారతీయ సినిమానే కాదు యావత్ ప్రపంచంలోని రజనీకాంత్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఆశగా ఎదురు చూస్తున్న వేడుకలో ఒకటి ఈ నెల 12న బ్రహ్మాండంగా జరగనుంది. అదే కబాలి చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం. సూపర్‌స్టార్ చాలా గ్యాప్ తరువాత గ్యాంగ్‌స్టర్‌గా నటించిన చిత్రం కబాలి. నటి రాధికాఆప్తే నాయకిగా నటించిన ఈ చిత్రాన్ని మెడ్రాస్ చిత్రం ఫేమ్ రంజిత్ దర్శకత్వంలో కలైపులి ఎస్.థాను భారీ ఎత్తున్న నిర్మిస్తున్న చిత్రం ఇది. కబాలి చిత్రంపై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఇప్పటికే చిత్ర టీజర్ రికార్డులు బద్దలు కొడుతోంది. ఇక వ్యాపార పరంగానూ ప్రకంపనలు సృష్టిస్తోంది కబాలి. సంతోష్‌నారాయణన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్ర ఆడియోను ఈ నెల 12న స్థానిక వైఎంసీ మైదానంలో గ్రాండ్‌గా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం కుటుంబ సభ్యులతో అమెరికాలో విహార యాత్రలో ఉన్న మన సూపర్‌స్టార్ ఆ సమయానికి చెన్నై చేరుకుంటారని సమాచారం. ఇకపోతే రజనీకాంత్ అభిమానులకు మరో పర్వదినం ఏమిటంటే జూలై ఒకటో తేదీన కబాలి చిత్రం విడుదలవుతుందని ఇటీవల ఆ చిత్ర దర్శకుడు రంజిత్ వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement