మరో హారర్ చిత్రంగా పాండియోడ గలాటా తాంగలా | Pandiya galata tangala Movie | Sakshi
Sakshi News home page

మరో హారర్ చిత్రంగా పాండియోడ గలాటా తాంగలా

Published Sat, Apr 9 2016 1:45 AM | Last Updated on Sun, Sep 3 2017 9:29 PM

మరో హారర్ చిత్రంగా పాండియోడ  గలాటా తాంగలా

మరో హారర్ చిత్రంగా పాండియోడ గలాటా తాంగలా

కోలీవుడ్‌లో దెయ్యం కథా చిత్రాల హవా అప్రహతంగా సాగుతోంది. తాజాగా ఆ కోవలో రూపొందుతున్న చిత్రం పాండియోడ గలాటా తాంగలా. నితిన్ సత్య కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో రక్షరాజ్ నాయకిగా నటిస్తున్నారు. ఇతర పాత్రల్లో సింగమ్‌పులి, మయిల్‌సామి, ఇమాన్ అన్నాచ్చి నటిస్తున్న ఈ చిత్రానికి ఎస్‌టీ.గుణశేఖరన్ దర్శకత్వం వహిస్తున్నారు.
 
 మణికంఠన్ నిర్మాత.చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ముగ్గురు స్నేహితులు ఒక మ్యాన్షన్‌లోని పైభాగంలో చిన్న గదిలో అద్దెకు ఉంటారన్నారు. అయితే ఆర్థిక సమస్యలతో సతమతమయ్యే ఆ ముగ్గురు అద్దె చెల్లించలేక పోతారు. వారి నుంచి ఎలాగైనా అద్దె వసూలు చేయాలని పలు రకాల ప్రయత్నాలు చేసి విఫలమైన మ్యాన్షన్ యజమాని చివరికి ఆ బాధ్యతను పోలీసుకు అప్పగిస్తాడన్నారు.
 
 అయితే ఆ పోలీసును మచ్చిక చేసుకోవడానికి ముగ్గురు స్నేహితులు మందు పార్టీ ఇస్తారన్నారు.అయితే మద్యంమత్తులో పోలీస్ పైనుంచి కిందికి పడి మరణిస్తాడన్నారు. ఆ తరువాత దెయ్యంగా వచ్చి తను చనిపోవడానికి కారణం అయిన వారిపై ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం చేస్తాడని తెలిపారు. ఆ తరువాత ఏంజరిగిందన్నదే చిత్ర క్లైమాక్స్ అని దర్శకుడు అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement