ఎన్టీఆర్ సినిమాకు పవన్ క్లాప్ | Pawan Kalyan Cheif guest for Ntr, trivikram movie | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్ సినిమాకు పవన్ క్లాప్

Published Sun, Oct 22 2017 11:44 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

Pawan Kalyan Cheif guest for Ntr, trivikram movie - Sakshi

జై లవ కుశ సినిమాతో మరో భారీ విజయాన్ని నమోదు చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన కొత్త చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయనున్నాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా సినిమాను తెరకెక్కిస్తున్న త్రివిక్రమ్, ఆ సినిమా పూర్తయిన వెంటనే ఎన్టీఆర్ సినిమా పనులు ప్రారంభించనున్నాడు. అయితే ఈ లోగా ఎన్టీఆర్ త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాను లాంచనంగా ప్రారంభిస్తున్నారు చిత్రయూనిట్.

ఈ కార్యక్రమం సోమవారం జరగనుంది. అంతేకాదు ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో తెరకెక్కబోయే ఈ సినిమా ఓపెనింగ్ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హజరు అవుతున్నారు. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మించనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ 2018 జనవరి నుంచి ప్రారంభం కానుంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న పవన్ సినిమాకు అజ్ఞాతవాసి అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement