ఎన్టీఆర్‌ సినిమాను ప్రారంభించిన పవన్‌ | pawan attend ntr movie inauguration function | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్‌ సినిమాను ప్రారంభించిన పవన్‌

Published Mon, Oct 23 2017 11:48 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

 pawan attend ntr movie inauguration function - Sakshi

సాక్షి, సినిమా: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా ప్రారంభోత్సవ పూజా కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పవన్ క్లాప్ కొట్టి సినిమాను ప్రారంభించారు. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ ఎస్ రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  

ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ 2018 జనవరి నుంచి ప్రారంభం కానుంది. ఎన్టీఆర్ కెరీర్లో ఈ సినిమా 28వది.  ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా సినిమాను తెరకెక్కిస్తున్న త్రివిక్రమ్, ఆ సినిమా పూర్తయిన వెంటనే ఎన్టీఆర్ సినిమా పనులు ప్రారంభించనున్నాడు. 

(మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)

ఎన్టీఆర్ సినిమాకి పవన్ క్లాప్ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement