సాక్షి, సినిమా: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కొంత కాలంగా కంటి సమస్యను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఆ సమస్య పెరగిపోవడంతో పవన్ కల్యాణ్ బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఎల్వీప్రసాద్ ఆసుపత్రిలో చేరి శస్త్ర చికిత్స చేయించుకున్నారు.
అయితే పది రోజుల క్రితమే పవన్ కల్యాణ్ ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి వైద్యుల్ని సంప్రదించారు. వారు పవన్ కంటిని పరీక్షించి, ఎడమ కంట్లో కురుపు ఉన్నట్లుగా గుర్తించారు. శస్త్రచికిత్సతోనే కురుపును తొలగించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో ఆయన బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఎల్వీప్రసాద్ ఆసుపత్రిలో చేరారు. అనంతరం వైద్యులు పవన్ కంటికి శస్త్ర చికిత్స చేశారు. సర్జరీ సక్సెస్ అయ్యిందని వైద్యులు వెల్లడించారు. గురువారం సాయంత్రం పవన్‌ని డిశ్చార్జ్ చేసినట్లు వైద్యులు తెలిపారు. పవన్‌కు వైద్యులు కొన్నిరోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తొంది.
ఆ మధ్య కొన్ని రోజుల పాటు పవన్ నల్ల కళ్లద్దాల్ని వాడారు. తన కంటి సమస్య గురించి పవన్ తొలిసారిగా రంగస్థలం సక్సెస్ మీట్‌లో వెల్లడించారు. కానీ ఆ సమస్య ఏమిటన్నది అప్పుడు చెప్పలేదు. ఆ కార్యక్రమంకు ఆయన నల్ల కళ్లద్దాలు పెట్టుకొని వచ్చి, కంటి సమస్యతోనే కళ్లజోడు పెట్టుకున్నానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment