పీఎల్.తేనప్పన్, విశాల్
తమిళసినిమా: నిర్మాత, నిర్మాతలమండలి కార్యవర్గ సభ్యుడు పీఎల్.తేనప్పన్ తన పదవికి శుక్రవారం రాజీనామా చేశారు. మండలి అధ్యక్షుడు విశాల్‌పై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భం గా ఆయన నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్‌కు రాసిన లేఖలో తాను ఇప్పటి వరకూ నిర్మాతల మండలి ఉపాధ్యక్షుడిగా ఒకసారి కార్యదర్శిగా రెండు సార్లు, కార్యనిర్వాహక సభ్యుడిగా పలుమార్లు బాధ్యతలు నిర్వహించానన్నారు. ప్రస్తుత కార్యవర్గానికి వ్యతిరేక వర్గం నుంచి కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికయ్యానన్నారు. ప్రస్తుతం కార్యవర్గంలో శక్తివంచన లేకుండా తన బాధ్యలతను నిరూపించానని అన్నారు. అయితే ఇకపై ఈ పదవిలో కొనసాగడం ఇష్టం లేక రాజీనామా చేస్తున్నానని పేర్కొన్నారు.
స్థానిక టీ.నగర్‌లో సంఘ కార్యాలయాన్ని ప్రత్యేకంగా కట్టించడం అందుకు ప్రవేట్ కార్మికులను నియమించి డబ్బును ఖర్చు చేయడంలో తాను ఏకీభవంచలేనన్నారు. అదే విధంగా ఎవరితోనూ చర్చంచకుండా సీనియర్ సభ్యుల ఇన్సూరెన్స్‌ను రూ.4 లక్షల నుంచి, రూ.2 లక్షలకు తగ్గించడం సరికాదన్నారు. ఇక సినీ పరిశ్రమ సమ్మె నిర్వహించడానికి కారణాలు ఏమిటి? క్యూబ్ సంస్థలు ధరలను తగ్గిస్తారని చెప్పినా ప్రస్తుతం చిత్రానికి వారానికి రూ.5వేల చొప్పున తీసుకుంటున్నారని, అలా నాలుగు వారాలకు లెక్క కడితే ఇంతకు ముందు వారు వసూలు చేసినంతే అవుతోందని అన్నారు. కావున సమ్మె వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని, నిర్మాతలకు నష్టం వాటిల్లడం తప్ప. అంటూ విశాల్‌పై పలు విమర్శలు చేశారు. ఈ వ్యవహారం ఇప్పుడు కోలీవుడ్‌లో పెద్ద కలకలానికి దారి తీస్తున్నాయి. పీఎల్.తేనప్పన్ విమర్శలకు విశాల్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment