‘గ్లామరస్‌గా కనిపిస్తే తప్పేంటి?’ | Pooja Hegde Strong Reply to Netizens | Sakshi
Sakshi News home page

‘గ్లామరస్‌గా కనిపిస్తే తప్పేంటి?’

Published Sun, Aug 25 2019 6:56 AM | Last Updated on Sun, Aug 25 2019 10:18 AM

Pooja Hegde Strong Reply to Netizens - Sakshi

దేహమే ఆలయం అంటోంది నటి పూజాహెగ్డే. ఎంటీ సడన్‌గా ఈ అమ్మడు ఆధ్యాత్మిక చింతనతో మాట్లాడుతోంది? అని ఆశ్చర్యపోతున్నారా? అసలు విషయం తెలిస్తే ఆధ్యాత్మికం అందులో ఇసుమంత కూడా లేదని మీకే అనిపిస్తుంది. పూజాహెగ్డే గురించి ఇప్పుడు కొత్తగా చెప్పేదేమీ లేదు. మిస్‌వరల్డ్‌ అందాల పోటీలో పాల్గొని మూడో స్థానానికి పరిమితం అయిన ఈ బ్యూటీ ఆ తరువాత మోడలింగ్‌ రంగంలోకి ప్రవేశించి, ఆపై సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చారు.

మిస్కిన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ముఖముడి చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయం అయ్యింది పూజ. ఆ చిత్రం నిరాశపరచడంతో పూజాహెగ్డేను తమిళసినిమా మరచిపోయింది. దీంతో ఆ ఒక్క చిత్రంతోనే పూజాహెగ్డే తట్టాబుట్టా సర్దుకుంది. ఆ తరువాత టాలీవుడ్‌లో ఎంట్రీ స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది.

అల్లుఅర్జున్, మహేశ్‌బాబు వంటి స్టార్లతో జతకట్టి హిట్స్‌ను తన ఖాతా లో వేసుకుంది. రంగస్థలం చిత్రంలో ఐటమ్‌ సాంగ్‌లో ఆడి దుమ్మురేపింది కూడా. అలాంటిది అక్కడ కూడా మార్కెట్‌ కాస్త తగ్గింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో రెండు చిత్రాలు చేతిలో ఉన్నాయి. అవీ స్టార్‌ హీరోలతో నటిస్తున్నవి కావు. ఇక హిందీలో హౌస్‌పుల్‌ 4లో నటిస్తోంది. దీంతో మరిన్ని అవకాశాల కోసం గాలం వేసేపనిలో పడింది.

ముఖ్యంగా కోలీవుడ్‌లో పాగా వేయాలన్న ఆశ మాత్రం పోలేదట. అందులో భాగంగానే అందరి హీరోయిన్ల మాదిరి గానే అందాలు ఆరబోస్తూ ప్రత్యేకంగా ఫొటో సెషన్‌ను ఏర్పాటు చేసుకుని, ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాలకు విడుదల చేసింది. ఆ ఫొటోలపై నెటజిన్లే కాదు, సినీ అభిమానులు కామెట్స్‌ చేస్తున్నారు. కొందరైతే తీవ్రంగా విమర్శి స్తున్నారు.

దీంతో అలాంటి వారికి బదులిచ్చే విధంగా నటి  పూజాహెగ్డే దేహమే ఆలయం అని మన పెద్దలు అన్నారని, అదే విధంగా తన దేహాన్ని తాను ఆరాధిస్తానని చెప్పింది. అంతే కాకుండా అందాలను ప్రదర్శిస్తున్నాను.. ఇందులో తప్పేముంది? మీరు అంతగా ఇదైపోవాల్సిందేముంది?అని ఎదురు ప్రశ్న వేసింది. సమర్ధించుకోవడానికి ఎన్నైనా చెప్పుకోవచ్చు. అయితే ఇలాంటి ఫొటోలతో ఈ అమ్మడు సమాజానికి ఏం సందేశం ఇస్తుందే కూడా కాస్త అలోచించాలిగా అని కొందరు విమర్శిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement