‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో ప్రభాస్‌..! | Prabhas Guest Role In Rajamouli RRR | Sakshi
Sakshi News home page

Published Fri, Feb 1 2019 11:42 AM | Last Updated on Sun, Jul 14 2019 4:05 PM

Prabhas Guest Role In Rajamouli RRR - Sakshi

బాహుబలి లాంటి భారీ చిత్రం తరువాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌ (వర్కింగ్ టైటిల్‌). భారీ మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌లు హీరోలుగా నటిస్తున్నారు. ఈ సినిమా పిరియాడిక్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనుందన్న టాక్‌ వినిపిస్తోంది. ప్రస్తుతం రెండో షెడ్యూల్‌ షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్‌ న్యూస్‌ టాలీవుడ్ లో హల్‌చల్‌ చేస్తోంది.

ఈ సినిమాలో బాహుబలి స్టార్‌ ప్రభాస్ అతిథి పాత్రలో కనిపించనున్నాడట. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌లతో పాటు ప్రభాస్‌ను కూడా ఒకే ఫ్రేమ్‌లోచూపించేందుకు రాజమౌళి ప్లాన్‌ చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటికే  ఈ సినిమాకు సంబంధించి చాలా వార్తలు వినిపిస్తున్నా.. చిత్రయూనిట్ మాత్రం ఏ విషయాన్ని కన్ఫామ్‌ చేయాలేదు. మరి ప్రభాస్‌ అతిథి పాత్ర పై అయినా జక్కన టీం స్పందిస్తుందేమో చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement