బాహుబలి-3 కోసం ప్రభాస్ కు రాజమౌళి ఫోన్
బాహుబలి-3 కోసం ప్రభాస్ కు రాజమౌళి ఫోన్
Published Thu, Jun 22 2017 8:54 PM | Last Updated on Tue, Sep 5 2017 2:14 PM
బాహుబలి ప్రాజెక్టుతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో దగ్గుబాటి రానా బుల్లితెరపై సందడి చేయనున్నాడు. భల్లాలదేవగా ఆకట్టుకున్న రానా త్వరలో 'నెంబర్ వన్ యారీ విత్ రానా' అనే షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. కేవలం సెలబ్రిటీలు మాత్రమే పాల్గొనే ఈ షోకు సంబంధించిన ఓ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాహుబలి దర్శకుడు రాజమౌళికి హీరో ప్రభాస్ షాకింగ్ రియాక్షన్ ఇవ్వడమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
త్వరలో ప్రారంభంకానున్న ఈ షోలో రాజమౌలి పొల్గొననున్నట్లు తెలిపే ఓ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. షోలో పాల్గొన్న సందర్భంగా రాజమౌళి , హీరో ప్రభాస్ కు ఫోన్ చేసి షాకివ్వగా.. యంగ్ రెబల్ స్టార్ దర్శకుడు ఊహించని రియాక్షన్ ఇచ్చాడు. షో నుంచి రాజమౌళి, బాహుబలి హీరో ప్రభాస్ కు కాల్ చేసి 'ఎక్కడున్నావ్.. కలవాలని ఉందని' అంటాడు. ఎందుకు ఏమైనా పని ఉందా అని ప్రభాస్ అడుగుతాడు. బాహుబలి పార్ట్-3 తీయాలనుకుంటున్నానని రాజమౌళి చెప్పగానే.. 'అమ్మ.. నీయమ్మ' అని ప్రభాస్ అనేస్తాడు. ఇక చూడండీ.. రాజమౌళితో పాటు 'భల్లాలదేవ' రానా గట్టిగా నవ్వేస్తారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే బాహుబలి ప్రాజెక్టు కోసం దాదాపు ఐదేళ‍్లు వెచ్చించడంతో ప్రభాస్ అలా స్పందించాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
Advertisement
Advertisement