
దాదాపు పదేళ్ల కిత్రం బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ హాకీ టీమ్ కోచ్‌గా నటించిన చిత్రం ‘చక్ దే ఇండియా’. ఆ టీమ్‌లో సెంటర్ ఫార్వార్డ్ ప్లేయర్ ప్రీతీ సబర్వాల్ గా నటించారు సాగరిక ఘాట్జే. ఇంతకీ ఈమె ఎవరో తెలుసు కదా. ఫేమస్ క్రికెట్ ప్లేయర్ జహీర్ ఖాన్ సతీమణి.
ఇప్పుడు సాగరిక గురించి ఎందుకంటే.. అప్పుడు హాకీ ప్లేయర్‌గా నటించిన ఆమె ఇప్పుడు ‘మాన్‌సూన్ ఫుట్‌బాల్’ చిత్రంలో ఫుట్‌బాల్ ప్లేయర్‌గా నటించనున్నారు. మిలింద్ ఉకే దర్శకత్వం వహించనున్నారు. జూన్‌లో సెట్స్‌పైకి వెళ్లనుంది. కొందరు హౌస్‌వైఫ్‌లు కలిసి ఓ ఫుట్‌బాల్ టీమ్‌గా ఏర్పడే కాన్సెప్ట్ ఆధారంగా ఈ సినిమా రూపొందనుంది.
Comments
Please login to add a commentAdd a comment