మీడియాపై హీరోయిన్ మండిపాటు | Priyanka Chopra mum on Salman Khan's 'raped woman' row | Sakshi
Sakshi News home page

మీడియాపై హీరోయిన్ మండిపాటు

Published Tue, Jul 5 2016 4:51 PM | Last Updated on Sat, Jul 28 2018 8:40 PM

మీడియాపై హీరోయిన్ మండిపాటు - Sakshi

మీడియాపై హీరోయిన్ మండిపాటు

న్యూఢిల్లీ: 'ఈ ప్రశ్న ఇప్పటికి 35 సార్లు నన్ను అడిగారు. 20 న్యూస్ పేపర్లకు సమాధానం చెప్పాను. సమయం సందర్భంగా లేకుండా మీడియా ఇలాంటి ప్రశ్నలు అడగడం సమంజసంగా లేదు. దేశంలోని యువత సాధికారత గురించి మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు కూడా అదే ప్రశ్న అడుగుతున్నార'ని హీరోయిన్ ప్రియాంక చోప్రా వాపోయింది.

హీరో సల్మాన్ ఖాన్ చేసిన 'రేప్' కామెంట్ పై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆమె ఈవిధంగా బదులిచ్చింది. యూనిసెఫ్ ఇండియా గుడ్ విల్ అంబాసిడర్ గా ఉన్న ప్రియాంక మంగళవారం 'ఫెయిర్ స్టాట్' ప్రచార కార్యక్రమంలో పాల్గొంది. ముఖ్యమైన విషయాలను వదిలేసి, వివాదాలకు మీడియా అధిక ప్రచారం కల్పించడం భావ్యం కాదని ప్రియాంక ఈ సందర్భంగా హితవు పలికింది.

సల్మాన్ చేసిన రేప్' వ్యాఖ్యలపై చాలా మంది సినిమా, రాజకీయ ప్రముఖులు ఖండించారు. 'సుల్తాన్' సినిమా షూటింగ్ సమయంలో తన పరిస్థితి అత్యాచార బాధితురాలిగా ఉందని వ్యాఖ్యానించి సల్మాన్ ఖాన్ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement