'ప్రపంచ ఆసియా శృంగార దేవత' ప్రియాంక | priyanka Chopra regains sexiest Asian crown | Sakshi
Sakshi News home page

'ప్రపంచ ఆసియా శృంగార దేవత' ప్రియాంక

Published Thu, Dec 4 2014 11:42 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

'ప్రపంచ ఆసియా శృంగార దేవత' ప్రియాంక - Sakshi

'ప్రపంచ ఆసియా శృంగార దేవత' ప్రియాంక

లండన్: బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా(32) ప్రపంచ ఆసియా శృంగార దేవత (వరల్డ్ సెక్సీయస్ట్ ఆసియన్ వుమెన్)గా ఎన్నికైంది. లండన్ లో గురువారం జరిగిన పోటీల్లో గత విజేత కత్రినా కైఫ్ ను ప్రక్కకు నెట్టి  ఆ స్థానాన్ని చేజిక్కించుకుంది. యూకే వీక్లీ న్యూస్ పేపర్ 'ఈస్ట్రన్ ఐ' నిర్వహించిన ఈ పోటీలో  50 మంది భామలను తోసిరాజని  ప్రియాంక ప్రథమ స్థానంలో నిలిచింది. 

 

ఇదిలా ఉండగా పాపులర్ టీవీ నటి  ద్రస్థి ధమి రెండో స్థానానికి పరిమితమైంది.   బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ కు ఈ పోటీల్లో నిరాశ ఎదురైంది. గత ఏడాది నంబర్ వన్ స్థానంలో నిలిచిన ఈ భామ నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది.  తాను సెక్సీయస్ వుమెన్ గా ఎన్నికవుతానని అనుకోలేదని.. ప్రస్తుతం ఈ టైటిల్ తనకు రావడం పట్ల చాలా సంతోషంగా ఉందని ప్రియాంక తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement