నిర్మాతల కష్టాలు తీరినట్లే!
Published Mon, Oct 28 2013 1:00 AM | Last Updated on Wed, Apr 3 2019 8:58 PM
సినిమా అనేది సమష్టి కృషి. అలాంటి సినిమా విజ యం సాధిస్తే దానికి సంబంధించిన ప్రతి వ్యక్తికీ ఫలితం ఉంటుంది. ఈ విషయం సినీ రంగంలోని ప్రతి ఒక్కరికీ తెలుసు. ఇక్కడ వచ్చిన సమస్య ఏమిటంటే విజయాన్ని తమ కనుగుణంగా మార్చుకునేవారు అపజయాన్ని ఇతరులపై రుద్దే ప్రయత్నం చేస్తుండడ మే. షూటింగ్ పూర్తి చేశామా, పారితోషికం ముట్టిందా, అక్కడితో మనపని అయిపోయింద నే ఆలోచనలు సినిమాను అనాథ ను చేస్తున్నాయి. ముఖ్యంగా రెండు మూడు హిట్స్ వచ్చిన హీరోయిన్లు ఇలాంటి ధోరణితోనే ప్రవర్తిస్తున్నారు.
అలాంటివారికి చెక్
కోలీవుడ్‌లో నటిస్తున్న అధికభాగం హీరోయిన్లు ఇతర భాషలకు చెందినవారే. అలాగే తమిళ హీరోయిన్లు ఇతర భాషల్లో ప్రాచుర్యం పొందుతున్నారు. పరభాషా హీరోయిన్లు భాష రాదన్న నెపంతో తమ పాత్రలకు డబ్బింగ్ చెప్పకుండా తప్పించుకుంటున్నారు. ఈ కాల్‌షీట్స్‌ను మరో చిత్రానికి కేటాయించి డబ్బు చేసుకుంటున్నా రు. అలాగే చిత్ర ప్రచారం, ఆడియో ఆవిష్కరణ, పత్రికా సమావేశాలలో పాల్గొనడం లేదు. కాదు కూడదంటే ప్లైట్ టికెట్ బుక్ చేయండి, నక్షత్ర హోటళ్లలో బసకు ఏర్పాటు చేయండి అంటూ నిర్మాతలకు చుక్కలు చూపుతున్నారు. నిర్మాతలు ఓ వైపు వడ్డీలు కట్టుకోలేక మరోవైపు హీరోహీరోయిన్ల గొంతెమ్మ కోర్కెలు తీర్చలేక నరకం చూస్తున్నారు.
ఇటీవల ఒక మహిళా నిర్మాత పదకొండు రోజులు బాలింత అయిన తాను షూటింగ్ నిర్మాణ కార్యక్రమాల్లో పాల్గొనక తప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రచార కార్యక్రమానికి రావాలని కోరితే హీరోయిన్ కోర్కెల జాబితా చెప్పిందని పేర్కొన్నారు. ఇలాగైతే నిర్మాతల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఎట్టకేలకు నిర్మాతల వెతలపై తమిళ నిర్మాతల మండలి దృష్టి సారించింది. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసే విధంగా చర్యలు చేపట్టింది. అందులో భాగంగా చిత్ర ప్రచారానికి సహకరించని హీరోయిన్లపై కొరడా ఝుళిపించింది. ప్రచారానికి రాని హీరోయిన్ల పారితోషికంలో 20 శాతం కట్ చేయనున్నట్లు నిర్మాతల మండలి అధ్యక్షుడు కేఆర్ ఇటీవల ప్రకటించారు.
మేనేజర్లపైనా చర్యలు
కొందరు హీరోయిన్లు మేనేజర్ల గుప్పెట్లో ఉంటారు. మేనేజర్లు వారి స్వార్థం కోసం హీరోయిన్లను తప్పుదారి పట్టిస్తున్న సంఘట నలు వెలుగులోకొచ్చాయి. ప్రచారానికి రాకుండా హీరోయిన్లను కట్టడి చేసే మేనేజర్లపైనా చర్యలుంటాయని కేఆర్ వెల్లడించారు.
ప్రచార కార్యక్రమాలు కళకళ
నిర్మాతల మండలి నిర్ణయం ప్రభావం చూపుతోంది. తద్వారా నిర్మాతల ఇబ్బందులు తీరినట్లేనన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాల్లో హీరోయిన్లు పాల్గొన్నారు. జీవా హీరోగా నటిస్తున్న ఎండ్రెండ్రుమ్ పున్నగై చిత్ర ఆడియో ఆవిష్కరణలో త్రిష, ఆండ్రియా పాల్గొన్నారు. విలా అనే మరో చిత్రం ఆడియో ఆవిష్కరణలో నమిత, కుష్భు వంటి తారలు పాల్గొని కార్యక్రమానికి కళ తెచ్చారు.
Advertisement
Advertisement