పుల్లయ్య ప్రేమకథ
తెలుగు, తమిళ భాషల్లో ఓ విభిన్న ప్రేమకథతో రూపొందిన చిత్రం ‘పుల్లయ్య ప్రేమకథ’. రమేష్ వర్షశ్రీ దర్శకత్వంలో సమ్రిత క్రియేషన్స్ పతాకంపై శ్రీమతి గంగాదేవి సమర్పణలో పెయ్యల ప్రవీణ్‌కుమార్ నిర్మించారు.
వచ్చే నెల మొదటి వారంలో పాటలను, అదే నెలాఖరున సినిమాని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథా చిత్రం ఇది. ‘వేదం’ ఫేమ్ నాగయ్య నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.
ఇందులో ఉన్న ఐదు పాటలకు సిద్ధార్ధ్ వాటికన్స్ మంచి స్వరాలిచ్చారు’’ అని చెప్పారు. నాగరాజు, లక్ష్మీ, సింగం మహేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: మనోహర్ కొల్లి, ఎడిటింగ్: కడప శ్రీను.