సెర్చ్‌ కంప్లీట్‌ | Puneeth Rajkumar's Natasarwa Bhowma | Sakshi
Sakshi News home page

సెర్చ్‌ కంప్లీట్‌

Published Sun, Apr 29 2018 2:12 AM | Last Updated on Fri, Mar 22 2019 5:29 PM

Puneeth Rajkumar's Natasarwa Bhowma - Sakshi

కోల్‌కతా మొత్తం తిరిగేశారు దర్శకుడు పవన్‌ వడియార్‌. హాలీడే ట్రిప్‌ కోసం కాదు. లొకేషన్స్‌ సెర్చ్‌ కోసం. పునీత్‌ రాజ్‌కుమార్‌ హీరోగా రాక్‌లైన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై పవన్‌ వడియార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘నటసార్వభౌమ’. ఈ సినిమా నెక్ట్స్‌ షెడ్యూల్‌ను కోల్‌కతాలో జరపాలనుకుంటున్నారు.

అందుకే లొకేషన్స్‌ సెర్చ్‌ కోసం కోల్‌కతా వెళ్లి తిరిగొచ్చారు పవన్‌ వడియార్‌. ‘సెర్చ్‌ కంప్లీట్‌ అయ్యింది. బైబై టు కోల్‌కతా’ అని పేర్కొన్నారు పవన్‌ వడియార్‌. మరి.. షూటింగ్‌ ఎప్పుడు స్టార్ట్‌ చేస్తారో చూడాలి. ఈ సినిమాలో ప్రియాంకా జవాల్కర్‌ కథానాయికగా నటించనున్నారు. ఐదేళ్ల క్రితం ‘గోవిందాయ నమః’ అనే కన్నడ చిత్రాన్ని తెలుగులో ‘పోటుగాడు’ అనే టైటిల్‌తో రిలీజ్‌ చేశారు. మంచు మనోజ్‌ హీరోగా నటించిన ఈ సినిమాకు పవన్‌ వడియార్‌నే దర్శకుడు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement