
‘‘ఆది అసిస్టెంట్ డైరెక్టర్‌గా నా వద్ద చాలా సంవత్సరాలు పని చేశాడు. ఇప్పుడు తను దర్శకునిగా ‘రణస్థలం’ సినిమా చేయడం హ్యాపీగా ఉంది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. టీమ్‌కి అల్ ద బెస్ట్’’ అని దర్శకుడు పూరి జగన్నాథ్ అన్నారు. రాజ్, షాలు జంటగా ఆది అరవల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రణస్థలం’. సంతోష ఆంజనేయులు సమర్పణలో శ్రీలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై కావలి రాజు నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ను పూరి జగన్నాథ్ విడుదల చేశారు. ఆది అరవల మాట్లాడుతూ– ‘‘పక్కా కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రమిది. ప్రేమకథ కూడా ఉంటుంది. మా గురువు పూరి జగన్నాథ్‌గారి చేతుల మీదుగా ట్రైలర్ విడుదల కావడం ఆనందంగా ఉంది’’ అన్నారు. ‘‘కెమెరామన్ ప్రభాకర్, సంగీత దర్శకుడు రాజకిరణ్ చక్కటి అవుట్‌పుట్ ఇచ్చారు. మా చిత్రాన్ని నవంబర్ ఆఖరులో విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు కావలి రాజు.
Comments
Please login to add a commentAdd a comment