
అల్లు అర్జున్
కేరళ అడవుల్లో ఇప్పట్లో షూటింగ్ కుదరదని ‘పుష్ప’ టీమ్ మహబూబ్ నగర్ అడవుల్లో షూటింగ్ ప్లాన్ చేస్తోందని సమాచారం. అల్లు అర్జున్, రష్మికా మందన్నా జంటగా సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘పుష్ప’. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. చిత్తూరు జిల్లా గంధం చెట్ల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని తెలిసింది. సుకుమార్ అంyŠ టీమ్ రెక్కీ నిర్వహించి కేరళ అడవుల్లో షూటింగ్ ప్రారంభించారు.
తొలి షెడ్యూల్ పూర్తయిన తర్వాత కరోనా లాక్‌డౌన్‌తో ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేరళలో షూటింగ్ చేయడం సాధ్యం కాదని భావించి, అందుకు ప్రత్యామ్నాయంగా కేరళ అడవులను పోలి ఉండే మహబూబ్‌నగర్‌లో షూటింగ్ చేయాలనుకుంటున్నారట సుకుమార్. అలాగే హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో భారీ సెట్‌ను వేయనున్నారని సమాచారమ్.
Comments
Please login to add a commentAdd a comment