నిర్మాత రాజ్‌కుమార్‌ బర్జాత్య మృతి | Raj Kumar Barjatya funeral in Mumbai | Sakshi
Sakshi News home page

నిర్మాత రాజ్‌కుమార్‌ బర్జాత్య మృతి

Published Fri, Feb 22 2019 1:40 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

Raj Kumar Barjatya funeral in Mumbai - Sakshi

‘మైనే ప్యార్‌ కియా, హమ్‌ ఆప్‌ హై కౌన్, హమ్‌ సాత్‌ సాత్‌ హై, వివాహ్‌’ వంటి బ్లాక్‌బస్టర్‌ కుటుంబ ప్రేమకథ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన నిర్మాత రాజ్‌ కుమార్‌ బర్జాత్య గురువారం గుండెపోటుతో కన్నుమూశారు. రాజ్‌శ్రీ సంస్థ ట్వీటర్‌ అకౌంట్‌ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించింది. రాజ్‌శ్రీ పిక్చర్స్‌ బ్యానర్‌ను రాజ్‌ కుమార్‌ తండ్రి తారాచంద్‌ బర్జాత్య స్థాపించారు. ఆ తర్వాత ఆ బ్యానర్‌పై నిర్మాణంలో చురుకుగా పాల్గొన్నారాయన. రాజ్‌కుమార్‌ తనయుడు సూరజ్‌ బర్జాత్య దర్శక–నిర్మాత అనే సంగతి తెలిసిందే. కుటుంబ కథలకే పెద్ద పీట వేసిందీ సంస్థ. బాలీవుడ్‌లో ఉన్న పేరున్న నిర్మాణ సంస్థల్లో రాజ్‌శ్రీ ఒకటి. తారాచంద్‌ బర్జాత్య తర్వాత ఆ సంస్థ ప్రతిష్టను కాపాడే సినిమాలు తీసిన రాజ్‌కుమార్‌ మృతికి పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement