రాజమౌళి నెక్ట్స్ హీరో నానినే..?
ప్రస్తుతం బాహుబలి పనుల్లో బిజీగా ఉన్న రాజమౌళి తన నెక్ట్స్ సినిమాపై కూడా క్లారిటీగా ఉన్నాడన్న టాక్ వినిపిస్తోంది. గతంలో మగధీర వంటి విజువల్ వండర్ తరువాత మర్యాదరామన్న లాంటి చిన్న సినిమాను తెరకెక్కించిన జక్కన్న, ఈ సారి కూడా అదే ఫార్ములాను ఫాలో అవ్వాలని ప్లాన్ చేస్తున్నాడు.
అందుకే బాహుబలి తరువాత ఓ మామూలు లవ్ స్టోరిని రూపొందించే ప్లాన్లో ఉన్నాడు. ఈ సినిమాలో నాని హీరోగా నటించే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతానికి ఈ సినిమాపై ఎలాంటి అధికారిక ప్రకటనా లేకపోయినా.. బాహుబలి తరువాత తన మీద ఏర్పడే అంచనాలను తగ్గించుకునేందుకు రాజమౌళి చిన్న సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తాడని భావిస్తున్నారు ఇండస్ట్రీ వర్గాలు.