రజనీ కొత్త చిత్రం కన్నాభిరాన్?
సినిమాలకు టైటిల్స్ ఇంపార్టెంట్ పాత్ర పోషిస్తాయన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అదే విధంగా విజయవంతమైన పాత చిత్రాలను మళ్లీ వాడే సంస్కృతి పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించనున్న తాజా చిత్రం పేరేమిటన్న విషయంపై చాలా ఆసక్తి నెలకొంది. చిన్న గ్యాప్ తరువాత రజనీకాంత్ పక్కా కమర్షియల్ చిత్రం చేయడానికి సిద్ధం అవుతున్నారు.ఇందులో ఆయనకు జంటగా నటించే లక్కీచాన్స్‌ను నటి రాధికాఆప్తే దక్కించుకుంది.కాగా అట్టక త్తి అనే చిన్న చిత్రంతో దర్శకుడిగా పయనం ప్రారంభించి అనూహ్య విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న రంజిత్ ఆ తరువాత కార్తీ హీరోగా మెడ్రాస్ చిత్రాన్ని రియలిస్టిక్‌గా తెరకెక్కించి ఘన విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు తంతే గారెల బుట్టలో పడ్డట్టు ఏకంగా సూపర్‌స్టార్ దృష్టిలో పడ్డారు. ఇప్పుడు వీరి కాంబినేషన్‌లో ఒక భారీ చిత్రం రూపొందనుంది. ఎస్ రంజిత్ సూపర్‌స్టార్ రజనీకాంత్ కోసం సూపర్ కథను సిద్ధం చేశారు. అతి త్వరలోనే ఈ క్రేజీ చిత్రం సెట్‌పైకి వెళ్లనుంది.
కాగా ఈ చిత్రానికి టైటిల్ ఏమిటన్న విషయంపై పలు రకాల ప్రచారం జరుగుతోంది.ఇంతకు ముందు కాళీ అనే టైటిల్ ప్రచారంలో ఉండగా తాజాగా కన్నాభిరాన్ టైటిల్ తెరపైకొచ్చింది.ఈ టైటిల్ సూపర్‌స్టార్‌కు బాగా న చ్చిందని సమాచారం.అయితే ఇదే టైటిల్‌తో ఇంతకు ముందు దర్శకుడు అమీర్ చిత్రం చేయనున్నట్లు వెల్లడించారు.కారణాలేమైనా ఆ చిత్ర నిర్మాణం జరగలేదు.అయితే కన్నాభిరాన్ టైటిల్ మాత్రం అమీర్‌కే సొంతంగా ఉంది.ఇప్పుడా టైటిల్‌ను రజనీకాంత్ కోసం పొందే ప్రయత్నాలు జరుగుతున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం.ఇంకో విషయం ఏమిటంటే ఇంతకు ముందు రజనీకాంత్ నటించిన లింగా చిత్ర టైటిల్ కూడా అమీర్ వద్ద నుంచే తీసుకున్నారన్నది గమనార్హం.తాను రజనీకాంత్ వీరాభిమానిని.ఆయన కోరితే ఇవ్వనంటానా అని అమీర్ లింగా టైటిల్‌ను ఇచ్చారు. అలాగే కన్నాభిరాన్ టైటిల్‌ను కూడా ఇచ్చేస్తారో లేదో చూడాలి.