
కోలివుడ్ కాలింగ్
యాంగ్రీ మేన్ రాజశేఖర్ దాదాపు 32 ఏళ్ల తర్వాత ఓ తమిళ చిత్రంలో నటించనున్నారు.
యాంగ్రీ మేన్ రాజశేఖర్ దాదాపు 32 ఏళ్ల తర్వాత ఓ తమిళ చిత్రంలో నటించనున్నారా అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. కెరీర్ ప్రారంభంలో 1984లో ‘పుదుమై పెన్’, 1985లో ‘పుదియ తీర్పు’ వంటి తమిళ చిత్రాల్లో నటించారాయన. ఆ తర్వాత తెలుగు చిత్రాలకే పరిమితమయ్యారు.
ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘పిఎస్‌వి గరుడ వేగ 125.18’ చిత్రంలో తనకు అచ్చొచ్చిన పోలీస్ పాత్రలో నటిస్తున్నారు రాజశేఖర్. ఈ చిత్రం షూటింగ్ పూర్తి కాక ముందే వెంకట్ ప్రభు దర్శకత్వంలో తమిళ చిత్రంలో నటించడానికి ఆయన గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని సమాచారం. వెంకట్ ప్రభు ఇప్పటికే రాజశేఖర్‌కు కథ వినిపించగా, ఆయనకు బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పారని భోగట్టా.