తలైవా జన్మదిన వేడుకలు వద్దన్నారు | Rajinikanth calls off birthday celebrations | Sakshi

తలైవా జన్మదిన వేడుకలు వద్దన్నారు

Dec 8 2015 12:11 PM | Updated on Sep 12 2019 10:40 AM

తలైవా జన్మదిన వేడుకలు వద్దన్నారు - Sakshi

తలైవా జన్మదిన వేడుకలు వద్దన్నారు

తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ తన పుట్టిన రోజు వేడుకలను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈసారి అభిమానులు ఎవరూ కూడా తన జన్మదిన వేడుకలను జరపవద్దని, ఆ మేరకు ఎవరైనా ప్రణాళికలు వేసుకుని ఉంటే వాటిని వెంటనే విరమించుకోవాలని చెప్పారు.

చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ తన పుట్టిన రోజు వేడుకలను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈసారి అభిమానులు ఎవరూ కూడా తన జన్మదిన వేడుకలను జరపవద్దని, ఆ మేరకు ఎవరైనా ప్రణాళికలు వేసుకుని ఉంటే వాటిని వెంటనే విరమించుకోవాలని చెప్పారు. తమిళనాడులో భారీ వర్షాలకారణంగా వరదలు పోటెత్తి చెన్నైతోపాటు పలు ప్రాంతాలు నీటిలో మునిగిపోయిన విషయం తెలిసిందే.

పరిస్థితులు అస్తవ్యస్తంగా తయారయ్యాయి కూడా. ఇలాంటి పరిస్థితులు ఉండగా ప్రస్తుతం జన్మదిన వేడుకల హడావుడి వద్దని, తన అభిమానులంతా కలిసి వరదలకు గురైనవారికి, ప్రాంతాలకు సహాయం చేయాలని కోరారు. చెన్నై మొత్తం కన్నీరుమున్నీరుగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో తనకు జన్మదిన వేడుకలకన్నా వారికి సహాయం చేయడమే ముఖ్యమని రజనీకాంత్ భావిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుత 63 ఏళ్ల వయసున్న రజనీకాంత్ ఈ వచ్చే శనివారం 64వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement