
మోడీకి రజనీ స్పెషల్ షో!
రజనీకాంత్ నటించిన ‘కోచ్చడయాన్’ (తెలుగులో ‘విక్రమ సింహ’) మే 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు ఉన్నాయి. బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ కూడా ఈ చిత్రంపై ప్రత్యేక ఆసక్తి కనబరిచారు. ఇటీవల చెన్నైలో రజనీకాంత్‌ని కలిసినపుడు ‘కోచ్చడయాన్’ గురించి ప్రస్తావించారట. అందుకే గుజరాత్‌లో ఆయన కోసం ప్రత్యేక ప్రదర్శన వేయడానికి రజనీ సన్నాహాలు చేస్తున్నారట.