చలపతిరావు కామెంట్‌పై రకుల్‌ ఫైర్‌ | Rakul preet angries on chalapati rao for his comments on woman | Sakshi
Sakshi News home page

చలపతిరావు కామెంట్‌పై రకుల్‌ ఫైర్‌

Published Tue, May 23 2017 3:26 PM | Last Updated on Tue, Sep 5 2017 11:49 AM

చలపతిరావు కామెంట్‌పై రకుల్‌ ఫైర్‌

చలపతిరావు కామెంట్‌పై రకుల్‌ ఫైర్‌

రారండోయ్‌ వేడుక చూద్దాం ఆడియో ఫంక్షన్‌ వేదికగా సీనియర్‌ నటుడు చలపతి రావు మహిళలపై వాడిన అసభ్య పదజాలంపై హీరోయిన్ రకుల్‌ ప్రీతి సింగ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్వీటర్‌ ద్వారా స్పందించారు. ఆలస్యంగా స్పందించడానికి గల కారణాన్ని చెబుతూ.. చలపతి రావు చేసిన వ్యాఖ్య అర్ధం తనకు తెలియదని మీడియాలో వస్తున్న వార్తల ద్వారా ఆ విషయం తెలుసుకున్నట్లు చెప్పారు. చలపతిరావు చేసిన కామెంట్‌కు అర్ధం తెలిసివుంటే స్టేజ్‌ మీదే సమాధానం ఇచ్చేదాన్నని, ఆ కామెంట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.

టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో ఓ సీనియర్‌ నటుడిగా ఆయనకు ఉన్న స్ధానాన్ని, వయసును గుర్తు పెట్టుకుని మాట్లాడివుంటే బాగుండేదని అన్నారు. మహిళలపై అలాంటి పదజాలాన్ని వినియోగించడం వల్ల తోటి వారిని తప్పుడు మార్గంలో ప్రోత్సహించినట్లు ఉంటుందని తెలిపారు. ఇండస్ట్రీలోకి వచ్చే కొత్త వాళ్లపైనా చెడు ప్రభావం పడుతుందని పేర్కొంది. కెరీర్ ఆరంభంలో చాలా సందర్భాల్లో చాలా మంది ఇలాంటి వ్యాఖ్యలు చేసినా.. చాలా సార్లు మిన్నకుండిపోయానని, కానీ ఇప్పుడు జరిగిన సంఘటనతో మాత్రం నోరు మెదపకుండా ఉండలేకపోతున్నానని చెప్పుకొచ్చింది.

అయితే, చలపతిరావు మాట్లాడుతున్న సమయంలో తాను, నాగచైతన్య స్టేజ్‌పై నవ్వడానికి కారణం ఆయన చేసిన కామెంట్‌ కాదని తెలిపింది. ఇదే విషయంపై హీరో నాగ చైతన్య కూడా ట్వీటర్‌ ద్వారా స్పందించారు. తాను నవ్వడానికి కారణం వేరే ఉందని తెలిపారు.

అబ్బాయిలే విషపూరితం
ప్రస్తుతం టాలీవుడ్‌లోని క్రేజీ హీరోయిన్లలో రకుల్‌ ప్రీతి సింగ్‌ ఒకరు. రకుల్‌, నాగ చైతన్య జంటగా నటిస్తున్న  చిత్రం 'రారండోయ్‌ వేడుకచూద్దాం' ఈ నెల 26వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఓ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో చిత్ర విశేషాలను పంచుకుంది. అమ్మాయిలు ఆరోగ్యానికి హానికరం అనే చైతూ డైలాగ్‌పై మాట్లాడుతూ తన ఉద్దేశంలో అబ్బాయిలు విషపూరితం అని వ్యాఖ్యానించింది. ఈ చిత్రానికి దర్శకుడు సోగ్గాడే చిన్నినాయనా ఫేమ్‌ కల్యాణ్‌ కృష్ణ. దీంతో మరోసారి నాగ్‌ కుటుంబానికి కృష్ణ బ్రేక్‌ ఇస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement