తెలుగబ్బాయితోనే నా వివాహం..! | Rakul Preet may marry a Telugu guy | Sakshi
Sakshi News home page

తెలుగబ్బాయితోనే నా వివాహం..!

Published Mon, Dec 11 2017 3:30 PM | Last Updated on Mon, Dec 11 2017 3:30 PM

Rakul Preet may marry a Telugu guy - Sakshi

తమ పెళ్లిళ్ల గురించి అందమైన కలలను అప్పుడప్పుడు వివరిస్తూ ఉంటారు హీరోయిన్లు. ఎంతో మంది యువకుల కలల రాణులు అయిన వీళ్లు.. తమ పెళ్లిళ్ల గురించి చెప్పే మాటలు చాలా ఆసక్తికరంగా ఉంటాయని వేరే చెప్పనక్కర్లేదు. ఇలాంటి ప్రకటనలు చేయడంలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా ముందుంటుంది. హీరోయిన్ గా ఇప్పుడు టాప్ స్టేటస్ ను ఎంజాయ్ చేస్తున్న ఈ భామ ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునేది లేదని అంటుంది కానీ.. తనకు కాబోయే వాడి గురించి తన ఊహలను చెబుతూ ఉంటుంది.

అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తన స్టైల్ లో పెళ్లి గురించి కొన్ని స్వీట్ కామెంట్స్ చేసింది  రకుల్. ఎప్పుడు ఏం జరుగుతుంది. ఎలా జరుగుతుంది అనే విషయం మనకు తెలియదు. సో.. నా పెళ్లి కూడా జరగవచ్చు.. అది కూడా ఒక తెలుగబ్బాయితో వివాహం జరగవచ్చు అని వివరించింది. దీంతో అమ్మడు కూడా సమంత లాగా టాలీవుడ్ హీరోని చేసుకుంటుందా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

టాలీవుడ్ లో కుర్ర హీరోలు కూడా చాలామందే ఉన్నారు. రకుల్ లాంటి అందగత్తె అండ్ స్టార్ హీరోయిన్ ని జీవిత భాగస్వామిగా చేసుకోవడానికి ఛాన్స్ దొరికితే ఏ మాత్రం వదిలిపెట్టరు. అయితే రకుల్ కి ఇన్నేళ్లలో ఏ హీరో నుంచి ప్రపోజల్స్ రాలేదట. మొదట్లో ఓ హీరో ఆమె కెరీర్ కు హెల్ప్ చేశాడని వారిద్దరు లవర్స్ అని రూమర్స్ బాగానే వచ్చాయి. కాని రకుల్ వాటిని పట్టించుకోలేదు. మరి పెళ్లి చేసుకుంటే అమ్మడు ఎలాంటి వాడిని సెలెక్ట్ చేసుకుంటుందో చూడాలి.. ఆ అదృష్టవంతుడు ఎవరో..మరి..?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement