
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ సతీమణిగా..అపోలో హాస్పిటల్ ఫౌండేషన్ వైస్ చైర్ పర్సన్‌గా ఉపాసన కొణిదెల ప్రత్యేక పాత్ర పోషిస్తూ ఉంటారు. చరణ్‌కు సంబంధించిన విశేషాలతోపాటు అనేక విషయాలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. మెగాస్టార్ చిరజీవి రెండో కూతురు శ్రీజా- కళ్యాణ్ దేవ్‌ల గారాల పట్టి నవిష్క పుట్టిన రోజు వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. అదే రోజు క్రిస్మస్ కావడంతో మెగా ఫ్యామిలీలో పండగ వాతావరణం నెలకొంది. ఇక ఈ పార్టీలో రామ్ చరణ్, ఉపాసన ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇద్దరూ ఎల్లో కలర్ దుస్తుల్లో మెరిసిపోయారు. పార్టీలో శ్రీజ, కల్యాణ్ దంపతుల కూతురితో దిగిన ఫోటోలను ఉపాసన తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ‘అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు. అత్త మామల ప్రేమతో..హ్యపీ బర్త్‌డే డార్లింగ్ నవిష్క’ అని క్యాప్షన్ జోడించారు. అలాగే బర్త్‌డే బేబీ తండ్రి కళ్యాణ్ దేవ్ సైతం కూతురు పుట్టిన రోజు సందర్భంగా భావోద్వేగ ట్వీట్ చేశారు. తన కూతురు మీద ఉన్న ప్రేమను ముద్దుగా ట్వీట్ రూపంలో తెలియజేశాడు.
ఇక సినిమాల విషయానికొస్తే రామ్ చరణ్ తాజాగా నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ ఆర్‌ఆర్‌ఆర్. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాలో యంగ్‌టైగర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా నటిస్తున్న విషయం తెలిసిందే. చరణ్‌కు జోడీగా అలియా భట్.. ఎన్టీఆర్‌కు జోడిగా హాలీవుడ్ నటి ఒలివియా మోరిన్ నటిస్తున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది జూలై 31న విడుదల కానుంది.