ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం సినిమాలో నటిస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్వరలో తన కొత్త సినిమా ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే రంగస్థలం షూటింగ్ దాదాపుగా పూర్తి కావటంతో తరువాతి ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టాడు చరణ్. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఇప్పటికే లాంఛనంగా ప్రారంభమైన సినిమాను జనవరి 19 నుంచి మొదలు పెట్టనున్నాడు.
ఇటీవల ఈ సినిమాపై రకరకాల వార్తలు టాలీవుడ్ లో హల్‌చల్ చేశాయి. ఈ సినిమా మల్టీ స్టారర్ జానర్‌లో తెరకెక్కనుందన్న టాక్ తో పాటు సినిమా ఆగిపోయిందన్న ప్రచారం కూడా జరిగింది. అయితే ఆ రూమర్స్‌కు చెక్ పెడుతూ ఈ వారంలోనే కొత్త సినిమాను సెట్స్ మీదకు తీసుకెళుతున్నాడు చెర్రీ. రామ్ చరణ్ ఫుల్ మాస్ లుక్‌లో కనిపిస్తున్న రంగస్థలం సినిమా టీజర్‌ను జనవరి 24న విడుదల చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment