
నాన్‌స్టాప్‌గా..!
మరో నాలుగు నెలల పాటు రామ్‌చరణ్‌కి నో బ్రేక్. ఏంటీ ఆశ్చర్యంగా ఉందా? శ్రీను వైట్ల దర్శకత్వంలో ఆయన నటిస్తున్న తాజా చిత్రం షూటింగ్ చిత్రీకరణను అలా ప్లాన్ చేశారు మరి. డి. పార్వతి సమర్పణలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్‌ఎల్‌పి పతాకంపై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గత నెల 21 నుంచి 30 వరకూ రామ్‌చరణ్, రకుల్‌ప్రీత్ సింగ్ పాల్గొనగా యూరప్‌లో పాటలు చిత్రీకరించారు. బుధవారం నాడు హైదరాబాద్‌లో రెండో షెడ్యూల్ మొదలుపెట్టారు.
సినిమా పూర్తయ్యేంతవరకూ నాన్‌స్టాప్‌గా చిత్రీకరణ జరుపుతామని నిర్మాత చెబుతూ -‘‘ ‘నాయక్’ తర్వాత మళ్లీ రామ్‌చరణ్‌తో సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. అక్టోబర్ 15న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ఇది మంచి ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్‌టైనర్ అని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కథ: కోన వెంకట్-గోపీ మోహన్, మాటలు: కోన వెంకట్, సంగీతం: తమన్ ఎస్.ఎస్., కెమెరా: మనోజ్ పరమహంస, లైన్ ప్రొడ్యూసర్: కృష్ణ.