DDV Danayya
-
నాన్‌స్టాప్‌గా..!
మరో నాలుగు నెలల పాటు రామ్‌చరణ్‌కి నో బ్రేక్. ఏంటీ ఆశ్చర్యంగా ఉందా? శ్రీను వైట్ల దర్శకత్వంలో ఆయన నటిస్తున్న తాజా చిత్రం షూటింగ్ చిత్రీకరణను అలా ప్లాన్ చేశారు మరి. డి. పార్వతి సమర్పణలో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్పి పతాకంపై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గత నెల 21 నుంచి 30 వరకూ రామ్‌చరణ్, రకుల్‌ప్రీత్ సింగ్ పాల్గొనగా యూరప్‌లో పాటలు చిత్రీకరించారు. బుధవారం నాడు హైదరాబాద్‌లో రెండో షెడ్యూల్ మొదలుపెట్టారు. సినిమా పూర్తయ్యేంతవరకూ నాన్‌స్టాప్‌గా చిత్రీకరణ జరుపుతామని నిర్మాత చెబుతూ -‘‘ ‘నాయక్’ తర్వాత మళ్లీ రామ్‌చరణ్‌తో సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. అక్టోబర్ 15న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ఇది మంచి ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్టైనర్ అని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కథ: కోన వెంకట్-గోపీ మోహన్, మాటలు: కోన వెంకట్, సంగీతం: తమన్ ఎస్.ఎస్., కెమెరా: మనోజ్ పరమహంస, లైన్ ప్రొడ్యూసర్: కృష్ణ. -
పవర్ఫుల్ స్టోరీతో...
రామ్‌చరణ్, శ్రీను వైట్ల కాంబినేషన్లో సినిమా కోసం అభిమానులు ఎప్పట్నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురు చూపులు ఫలించాయి. ఈ ఇద్దరి కాంబినేషన్ షురూ అయ్యింది. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ చిత్రం నిర్మించనున్నారు. ‘లౌక్యం’, ‘కరెంటు తీగ’.. ఇలా వరుస విజయాలతో దూసుకెళుతున్న రకుల్ ప్రీత్ సింగ్ ఇందులో కథానాయికగా నటించనున్నారు. మార్చి 5న పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. అదే నెల 16న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఈ సందర్భంగా శ్రీను వైట్ల మాట్లాడుతూ- ‘‘ కుటుంబ కథకు యాక్ష న్ అంశాలు జోడించి ఓ పవర్ఫుల్ స్టోరీ తయారు చేశాం. అత్యున్నత సాంకేతిక విలువలతో, భారీ తారాగణంతో ఈ చిత్రం ఉంటుంది’’ అన్నారు. డీవీవీ దానయ్య మాట్లాడుతూ- ‘‘ఎన్నో భారీ హిట్ చిత్రాలను అందించిన శ్రీనువైట్ల- కోనవెంకట్- గోపీమోహన్ కాంబినేషన్‌ను రిపీట్ చేస్తూ ఈ చిత్రం రూపొందనుంది. ‘వై దిస్ కొలవరి...’ పాటతో ఎంతో పాపులార్టీ తెచ్చుకున్న అనిరుధ్ ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు. అక్టోబర్ 15న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం ’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కథ: కోన వెంకట్, గోపీమోహన్, మాటలు: కోన వెంకట్, కెమెరా: మనోజ్ పరమహంస, ఎడిటింగ్: ఎ.ఆర్.వర్మ, ఆర్ట్: నారాయణ రెడ్డి, ఫెట్స్: అనల్ అర్స్, సమర్పణ: డి. పార్వతి, మూలకథ- స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: శ్రీను వైట్ల. -
వీవీ వినాయక్‌కు ప్రముఖుల పరామర్శ
చాగల్లు : ప్రముఖ సినీ దర్శకుడు వీవీ వినాయక్‌ను పలువురు రాజకీయ, సినీప్రముఖులు శనివారం కలిసి సంతాపం తెలిపారు. మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, పితాని సత్యనారాయణ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు జీఎస్ రావు, కారుమూరి నాగేశ్వరరావు, వైఎస్సార్ సీపీ నిడదవోలు నియోజకవర్గ సమన్వయకర్త రాజీవ్‌కృష్ణ, సినీ ప్రముఖులు, నిర్మాతలు డీవీవీ దానయ్య, పరుచూరి కిరీటి, ఠాగూర్ మధు, నటుడు రఘుబాబు, మాటల రచయిత కోన వెంకట్, వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు ఆత్కూరి దొరయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు కందుల దుర్గేష్, వైఎస్సార్ సీపీ జిల్లా కమిటీ సభ్యులు బండి పట్టాభి రామారావు(అబ్బులు), మహిళా నాయకురాలు పిల్లంగొళ్ల శ్రీలక్ష్మి, కొవ్వూరు డీఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు, నిడదవోలు సీఐ జి.శ్రీనివాసరావు, కలగర హరిబాబు, మారిశెట్టి వెంకటేశ్వరరావు, వైఎస్సార్ సీపీ మండల యువజన విభాగం అధ్యక్షుడు గారపాటి శ్రీనివాస్, కేతనపల్లి శ్రీనివాస్, ఆత్కూరి కృష్ణ, గండ్రోతు సూర్యనారాయణ, వెజ్జు వెంకటేశ్వరరావు, ఉప్పులూరి నానాజీ, డి.సూరిబాబు సంతాపం తెలిపారు.