టాలీవుడ్‌లో మణిరత్నం
దర్శకుడు మణిరత్నం టాలీవుడ్లో బిజీ బిజీగా గడపడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రము ఖ భారతీయ సినీ దర్శకుల్లో మణిరత్నం ఒక రు. ఆయన దర్శకత్వ శైలి ప్రత్యేకంగా ఉంటుం ది. మౌనరాగం, రోజా, నాయకన్, దళపతి లాంటి ఎన్నో సెన్సేషనల్ హిట్స్‌ను చిత్ర పరిశ్రమకు అందించిన ఘనత ఈ దర్శకుడిది. ఈ మధ్య విజయాలు ఆయనతో దోబూచులాడుతున్నాయి. అలాగే తాజా చిత్ర రూపకల్పనకు, ప్రణాళిక సెట్ కావడం లేదు. కడల్ చిత్రం తర్వాత చిత్రం ఏమిటన్న విషయంలో ఇప్పటికీ స్పష్టత లేదు. ఆ మధ్య తమిళం, తెలుగు భాష ల్లో టాలీవుడ్ స్టార్స్ నాగార్జున, మహేష్‌బాబుతో మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కించే ప్రయత్నాలు చేశారు. ఈ ద్విభాషా చిత్రం సెట్ కాకపోవడంతో ఇదే స్టార్స్‌తో ముందుగా తెలుగు చిత్రం రూపొందించడానికి సన్నాహాలు జరిగాయి. తాజాగా ఆ ప్రయత్నం వెనక్కు పోయింది. ఇందుకు హీరోల్లో ఒకరైన మహేష్‌బాబు ఇతర చిత్రాలతో బిజీగా ఉండడమే నని ఆయన భార్య నటి సుహాసిని వివరించారు.
చిరంజీవి 150వ చిత్రం
కాగా ప్రస్తుతం రాజకీయ వాతావరణం చల్లబడడంతో మెగాస్టార్ చిరంజీవి మళ్లీ ముఖానికి రంగేసుకుని తన 150వ చిత్ర కలను నెరవేర్చుకోవడానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రాన్ని తన కొడుకు రామ్‌చరణ్ నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం బుధవారం చిరంజీవిని ఆయన ఇంటి లో కలవడం టాక్ ఆప్ ది ఇండస్ట్రీ అయ్యింది. ఈ సందర్భంగా వీరి మధ్య సుదీర్ఘ చర్చలు జరిగినట్లు సమాచారం. చిరంజీవి 150వ చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. వారి విషయంలో నటుడు రామ్‌చరణ్ నిర్ణయం ఏమిటి? ఆయన ఆలోచనా ధోరణి ఎలా ఉంది? అన్నది తెలియాల్సి ఉంది. అలాగే నాగార్జున, మహేష్‌బాబు కాంబినేషన్‌లో చిత్రం వాయి దా పడడంతో ఇదే చిత్రాన్ని చిరంజీవి, రామ్‌చరణ్‌తో రూపొందించే విషయం మణిరత్నం - చిరంజీవి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. మరో క్రేజీ నటుడు అల్లు అర్జున్ పేరు కూడా ఈ చర్చలో హల్‌చల్ చేసినట్లు సమాచారం. ఈ చర్చలు ఒక కొలిక్కి వచ్చి స్పష్టమైన నిర్ణయం వెలువడడానికి మరికొంత సమయం పడుతుందని పరిశ్రమ వర్గాల భావన.