సాక్షి, హైదరాబాద్ : అతిలోక సుందరి శ్రీదేవి మరణాన్ని దర్శకుడు రాంగోపాల్ వర్మ జీర్ణించుకోలేకపోతున్నాడు. ఉదయం నుంచి వరుస ట్వీట్లు చేస్తూ విచారం వ్యక్తం చేస్తున్నాడు. శ్రీదేవితో తాను గడిపిన ప్రతిక్షణాన్ని సోషల్ మీడియాలో ప్రస్తావించిన వర్మ ఇక ఇదే చివరిదంటూ ఓ ట్వీట్ చేశాడు.
‘శ్రీదేవి గురించి ఇదే నా చివరి ట్వీట్.. ఇప్పటి నుంచి తను ఇంకా బ్రతికుండదనే ఊహించుకుంటాను.. శ్రీదేవిగారు, నేను మిమ్మల్ని ఇంతలా నవ్వించిన తర్వాత కూడా మీరు నన్నింతగా ఎడిపించడం అన్యాయం.. ఇంకెప్పటికీ మీతో మాట్లాడను..లైఫ్ లాంగ్ కటీఫ్’ అని ట్వీట్ చేశాడు.
తనని తాను శ్రీదేవి ఆరాధకుడిగా చెప్పుకునే రామ్ గోపాల్ వర్మ ఆమెతో గడిపిన ప్రతిక్షణాన్ని గుర్తుచేసుకుంటూ తపిస్తున్నాడు. ఆమె మరణ వార్త విని ఇంతలా దేవుణ్ని ఎప్పుడూ ద్వేషించలేదన్న వర్మ ‘క్షణక్షణం’ సినిమా షూటింగ్‌లో ఆమెతో గడిపిన ఫొటోలను పోస్ట్ చేశాడు.
Sridevi gurinchi idhe naa aakhari tweet..ippatnunchi thanu inkaa brathikundane voohinchukuntanu .. Sridevi gaaru, nenu mimmalni intha navvinchina tharvaatha kooda meeru nanninthagaa yedipinchadam anyaayam ..inkeppatikee meetho maatlaadanu ..life long khateef😡 pic.twitter.com/wePuCbzm0s
— Ram Gopal Varma (@RGVzoomin) 25 February 2018
Comments
Please login to add a commentAdd a comment