సాక్షి, ముంబయి : ప్రముఖ నటి శ్రీదేవి హఠాన్మరణం సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మను ఎంతమేరకు కుంగదీసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె అంటే వెర్రి అభిమానం, పిచ్చి, అంతకు మించి ప్రేమను ప్రకటించిన ఆయన శ్రీదేవి చనిపోయినప్పటి నుంచి తన బాధను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఆమెను ఎంతగా ఆరాధించారో, ఆమె లోకంలో ఎంతగా విహరిస్తారో తన ట్వీట్ల ద్వారా చూపించారు.
అయితే, తాజాగా మరోసారి దేవుడిని తన కసితీరా తిట్టిన రామ్‌గోపాల్ వర్మ 'దేవుడు ఏమాత్రం కనికరం లేకుండా క్రూరంగా శ్రీదేవిలాంటి దేవతను మన మధ్య లేకుండా దూరం చేసినా ఆమె ఎప్పుడూ మనతోనే ఉంటారు. వెండితెరపై వెలుగుతూ మనకు కనిపిస్తునే ఉంటారు. ఆమెను మన నుంచి దూరం చేసినందుకు దేవుడిని ఎప్పటికీ అసహ్యించుకుంటూనే ఉంటాను. కానీ, ఆమె అపురూపమైన అందం మనతోనే ఎప్పటికీ ఉండేందుకు మూవీ కెమెరాను సృష్టించిన లూయిస్ లుమేయిర్‌ను మాత్రం నేను ఎప్పటికీ ప్రేమిస్తాను' అంటూ ఆయన తాజాగా ట్వీట్ చేశారు.
Though God so cruelly took away a Goddess like Sridevi from amongst us,we still have her permanently etched on our screens
— Ram Gopal Varma (@RGVzoomin) 27 February 2018
I hate god for taking her away from us forever but I love Louis Lumiere for creating the movie camera for her beauty to stay with us forever.
Comments
Please login to add a commentAdd a comment